రాశి ఫలాలతోపాటూ... చంద్ర రాశి అనేది మరొకటి ఉంటుంది. దీన్నే మూన్ సైన్ (Moon Sign) అంటారు. ఇది ఒక్కో రాశి వారికి ఒక్కోలా ఉంటుంది. ఓ వ్యక్తి పుట్టినప్పుడు మూన్ సైన్ ఏ స్థానంలో ఉంది అన్న దాన్ని బట్టీ... వారు ఏ రంగు రాళ్లు ధరించాలన్నది ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు ఇవాళ చందమామ... కుంభరాశిలో ఉంటే... ఇవాళ భూమిపై పుట్టిన వారంతా... కుంభ రాశి మూన్ సైన్ కలిగివుంటారు.
రంగు రాళ్లకూ మూన్ సైన్కీ సంబంధం ఉంటుంది. మూన్ సైన్ ఆధారంగా ఏ రాశి వారు ఏ రాయిని ధరించాలో జ్యోతిష పండితులు నిర్ణయించారు. ఆ ప్రకారం కొని తొడుక్కుంటే... మంచి జరుగుతుందని చెబుతున్నారు. కాస్త రేటు ఎక్కువైనప్పటికీ... నాణ్యమైన రాయిని మాత్రమే కొనుక్కోవాలనే విషయం మర్చిపోవద్దు. అప్పుడే ప్రయోజనాలు కలుగుతాయని పండితులు వివరించారు.
మీన రాశి (Pisces): గురుగ్రహం ఈ రాశి వారిని పాలిస్తూ ఉంటుంది. అందువల్ల వీరు పసుపు నీలమణి (Yellow-Sapphire-gemstone) ధరించాలి. (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)