కర్కాటకం.. కర్కాటక రాశి వారు జీవితంలో మంచి విషయాలను ఎక్కువ లైక్ చేస్తుంటారు. ఈ రాశికి చెందిన చాలా మంది వ్యక్తులు ప్రధానంగా ఆహార ప్రియులు. దీంతో సహజంగానే బరువు ఎక్కువగా ఉంటారు. ప్రతి నెలా పెరుగుతున్న ఆహారం, కిరాణా బిల్లును తగ్గించుకోవడానికి పొదుపు చేయడం వీరికి కష్టంగా ఉంటుంది. దీంతో వారు తరచుగా భోజనం మానేస్తుంటారు. తద్వారా ఖర్చులను అరికట్టడానికి ప్రయత్నిస్తుంటారు. (ప్రతీకాత్మక చిత్రం)
ధనుస్సు.. కొత్త ఆహారపు పోకడలు కొన్నిసార్లు ఆశ్చర్యకరమైన ఫలితాలను చూపుతున్నప్పటికీ, ఈ రాశివారు ఆహారంపై మక్కువతో ఎక్కువగా లాగించేస్తుంటారు. దీంతో వారి జీవక్రియ పనికి ఆటంకం ఏర్పడే అవకాశం ఉంది. ఈ అలవాటును నివారించడం కోసం ధనుస్సు రాశివారు అడపాదడపా ఉపవాసం చేయడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే అది సాధ్యం కాకపోవచ్చు. కొవ్వును తగ్గించడం కోసం పస్తులు ఉండడం ఎల్లప్పుడూ ప్రభావవంతమైన పని అనిపించుకోదు. ఇది ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
మీనం
డైట్లో ఉన్నప్పుడు మీనరాశి వారు, తినాలనిపించే ఆహార పదార్థాలను ఫ్రిజ్‌లో నుంచి తొలగిస్తుంటారు. కొందరు ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎంచుకోవచ్చు. చాలా బిజీగా గడుపుతున్న సమయంలో మీనరాశి వారు ఎటువంటి ప్రయత్నం లేకుండా బరువు తగ్గాలనే ఆశతో తినడం మానేస్తుంటారు. అయితే ఇది అంతిమంగా వారి ఆరోగ్యానికి హాని చేస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
మేషం
మకరం, కన్య వంటి కొన్ని రాశులు తమ లక్ష్యాలను సాధించడానికి కష్టపడుతూ, నిలకడగా పని చేస్తాయి. అయితే మేషరాశి వారు లక్ష్యాన్ని వేగంగా చేరుకోవడానికి తెలివిగా పని చేస్తారు. జిమ్‌కి వెళ్లి వర్కవుట్ చేసి చెమట చిందించడం ద్వారా బరువు తొందరగా తగ్గాలనుకుంటారు. ఇందు కోసం ఏకంగా భోజనం మానేస్తుంటారు. (ప్రతీకాత్మక చిత్రం)