మిథునం (Gemini) : మిథున రాశివారి ఆలోచన భిన్నంగా ఉంటుంది. ఇతరులు ఎప్పుడు తమ గురించే మాట్లాడుకోవాలనీ, తమనే చూడాలని కోరుకుంటారు. అందువల్ల ఈ రాశి వారు భాగస్వాములుగా ఉన్నప్పుడు... మనసు తెలుసుకొని మెలగాలని జ్యోతిషులు సూచిస్తున్నారు. ఈ రాశి వారిని ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా... చేజారిపోయే ప్రమాదం ఉందంటున్నారు. భాగస్వామితో కాపురం చేయడం కష్టం అని వీరు భావిస్తే... విడాకులు తీసుకోవడానికి కూడా వెనకాడరట. ఐతే... ఇవేవీ వారు బయటకు చెప్పకుండా... సడెన్‌గా ఓ రోజు నిర్ణయం తీసుకుంటారనీ... అందువల్ల ఈ రాశి వారితో భాగస్వామి అయిన వారు మనసు తెలుసుకొని మెలగాలని సూచిస్తున్నారు.
సింహం (Leo) : సింహ రాశి వారికి ఉన్న సహజ లక్షణం ఎట్రాక్షన్. అంటే... వీరు ఎక్కడ ఉంటే... అక్కడ అంతా వీరి గురించే మాట్లాడుకుంటారు. వీరు చేసే పనులు అందర్నీ ఆకర్షిస్తాయి. ఆకర్షించే తరహా పనులు వీరు చెయ్యకపోయినా... ఆటోమేటిక్‌గా అందరి నోట్లో నాలుక అవుతారు. ఈ పరిస్థితికి తోజు ఈ రాశి వారు సహజంగానే తాము మిగతా వారి కంటే కాస్త ఉన్నతంగా ఉండాలని కోరుకుంటారు. అందువల్ల ఈ రాశి వారితో భాగస్వామిగా ఉన్నవారు... వీరిని హుందాగా చూసుకోవాల్సి ఉంటుంది. ఏమాత్రం తక్కువ చేసినా, చులకన చేసినా మూల్యం చెల్లించుకోక తప్పదంటున్నారు జ్యోతిషులు. వీరు తెగతెంపులు చేసుకోరు కానీ... దాంపత్య జీవితంలో చిక్కులు మాత్రం ఎదురవుతాయనీ, అలా జరగకుండా ఉండాలంటే... వీరిని అర్థం చేసుకొని... తదనుగుణంగా భాగస్వామి నడుచుకోవాలని సూచిస్తున్నారు.
తుల (Libra) : తుల రాశి వారితో అత్యంత అప్రమత్తంగా, జాగ్రత్తగా వ్యవహరించాలంటున్నారు జ్యోతిషులు. ఈ రాశి వారితో డీల్ అంటే... పెళ్లి, భాగస్వామ్యం, ఒప్పందాల వంటివి కుదుర్చుకునే ముందు... ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలంటున్నారు. తుల రాశి వారు సెంటిమెంట్లకు లొంగరు. అందువల్ల ఎవరి పట్లా ఎక్కువగా శ్రద్ధ చూపాలని అనుకోరు. తాము ఏది అనుకుంటే అది చేస్తారు. అందుకు అవతలి వాళ్లు ఒప్పుకోవాల్సిందే. ఈ రాశి వారికి ఎదురు తిరిగితే... పూర్తిగా డీల్ రద్దు చేసుకుంటారే తప్ప... సర్దుకుపోవడం అన్నది ఉండదంటున్నారు జ్యోతిషులు. ఐతే... వీరిని అర్థం చేసుకొని జీవించడం మొదలు పెడితే మాత్రం... ఎలాంటి సమస్యలూ రావంటున్నారు.
మకరం (Capricorn) : మకర రాశి వారు ఇతరులతో సంబంధాల విషయంలో అత్యంత కచ్చితంగా ఉంటారు. వీరికంటూ కొన్ని కోరికలు ఉంటాయి. అవి కచ్చితంగా తీరాల్సిందే. వీరితో భాగస్వామ్యులుగా అయ్యేవారు... ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ రాశి వారి కోరికలను తీర్చలేదంటే మాత్రం... వీరు వేరే దారి చూసుకుంటారు. తమకు ప్రాధాన్యం లేని చోటు తమకు అక్కర్లేదనే భావన వీరిలో ఉంటుందనీ... అందువల్ల ఈ రాశి వారికి తగిన గుర్తింపు, గౌరవం ఇచ్చి తీరాల్సందే అంటున్నారు నిపుణులు. ఎవరైతే ఈ రాశి వారికి సపోర్టుగా, వెన్నుదన్నుగా నిలుస్తారో... అలాంటి వారితోనే ఈ రాశి వారు కొనసాగుతారని చెబుతున్నారు.
కుంభం (Aquarius) : కుంభ రాశి వారితో అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే వీరు ఏదీ సూటిగా చెప్పరు. పైగా ఎమోషనల్‌గా చిక్కుల్లో పడేయడంలో వీరు ముందుంటారని పండితులు సూచిస్తున్నారు. భాగస్వామి తనతో సరిగా మెలగట్లేదనీ, తనకు తగిన ప్రాధాన్యం ఇవ్వట్లేదని ఈ రాశి వారు భావిస్తే... ఆ విషయాన్ని ముఖంపైనే చెప్పరు. అలాగని లోలోపల ఫీలవుతూ కూర్చోరు. భాగస్వామి తమ దారిలోకి వచ్చేలా ఏమోషనల్ నిర్ణయాలు తీసుకుంటారు. మేసెజ్‌లు, ఫొటోల వంటి వాటి ద్వారా ఒకరకమైన బ్లాక్మెయిల్ వంటివి చేస్తారు. ఐతే... భాగస్వామి తమకు అనుకూలంగా ఉంటే మాత్రం వీరు చక్కగానే వ్యవహరిస్తారట. ఒక్కోసారి ఎమోషనల్ అంశాలు ఎక్కువై... కాపురాలు కూలే ప్రమాదం కూడా ఉంటుందంటున్నారు నిపుణులు.
మీనం (Pices) : మీన రాశి వారు సెన్సిటివ్. ఎప్పుడూ సున్నితమైన మనసుతో, ఎమోషనల్ ఫీలింగ్స్‌తో ఉంటారు. ఐతే... సెన్సిటివ్ కదా అని వీరితో పెట్టుకుంటే మాత్రం ప్రమాదమే. తాము కోరినట్లు భాగస్వామి ఉండకపోతే... భాగస్వామికి హార్ట్ ఎటాక్ వచ్చే రేంజ్ నిర్ణయాలు తీసుకోవడంలో కూడా ఈ రాశి వారు వెనకాడరని పండితులు సూచిస్తున్నారు. ఒక్కసారి వీరికి కోపం వచ్చిందంటే... ఇక అంతే... అంతా తారుమారే అంటున్నారు. అందువల్ల ఈ రాశి వారితో ఉండేవారు, డీల్స్ కుదుర్చుకునే వారు... వీరి మనస్తత్వాన్ని అర్థం చేసుకోవాలే తప్ప... చులకనగా చూడొద్దని సూచిస్తున్నారు. వీరు తీవ్ర నిర్ణయం తీసుకుంటే మాత్రం... ఇక చేయగలిగేది ఏమీ ఉండదని హెచ్చరిస్తున్నారు. (Disclaimer: The information and information given in this article is based on general information. Telugu news18 does not confirm the same. Before implementing these, please contact the concerned expert.)