Astrology : డిసెంబర్ 31 నుంచి.. 2 రాశుల వారికి లాభం, 3 రాశుల వారికి నష్టం!
Astrology : డిసెంబర్ 31 నుంచి.. 2 రాశుల వారికి లాభం, 3 రాశుల వారికి నష్టం!
Horoscope : 2022 సంవత్సరం ముగుస్తోంది. 2023కి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఈ సంవత్సరం చివరి రోజైన డిసెంబర్ 31 నాడు జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఒక ముఖ్యమైన గ్రహ సంచారం జరుగుతుంది. దాని ప్రభావం ఏ రాశిపై ఎలా ఉంటుందో ఇక్కడ తెలుసుకుందాం.
Astrology : గ్రహాల స్థానం, రాశుల్లోకి ప్రవేశాన్ని బట్టీ.. వ్యక్తుల జాతకం మారుతూ ఉంటుంది. చాలా గ్రహాలు కొత్త సంవత్సరం నుంచి తమ రాశిని మార్చుకుంటాయి. దీని వలన కొన్ని రాశులకు లాభం, కొన్ని రాశులకు నష్టం జరుగుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
2/ 8
బుధుడు డిసెంబర్ 31 నుంచి ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. దీని ప్రభావం మొత్తం 12 రాశుల మీద ఉంటుంది. తిరోగమన బుధగ్రహం వలన ఏ రాశి వారికి ప్రయోజనం చేకూరుతుంది? ఏ రాశికి నష్టం వాటిల్లుతుందనే సమాచారం తెలుసుకుందాం.
3/ 8
మేషం (Aries) : బుధుడు ధనస్సు రాశిలోకి వెళ్లడం వల్ల మేష రాశి వారికి సమస్యలు ఎదురవుతాయి. ఆఫీస్ , వ్యాపారంలో కఠినమైన సవాళ్లు రావచ్చు. మానసిక ఒత్తిడి మొదలైనవి అనారోగ్య సమస్యలకు దారితీస్తాయి.
4/ 8
కర్కాటక రాశి (Cancer) : ఈ రాశి వారికి బుధ సంచారం ప్రయోజనకరంగా ఉంటుంది. వీరు పనిలో విజయం సాధిస్తారు. ఆర్థిక ప్రయోజనాలు కూడా పొందుతారు. పూర్వీకుల ఆస్తుల వల్ల లాభపడే అవకాశం ఉంది. వ్యాపారానికి కూడా సమయం అనుకూలంగా ఉంటుంది.
5/ 8
కన్య (Virgo) : బుధగ్రహ తిరోగమనం కారణంగా ఈ రాశి వారికి పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడంలో ఇబ్బందులు ఎదురవుతాయి.
6/ 8
వృశ్చికం (Scorpion) : ఈ రాశి వారికి వ్యాపారంలో ఇబ్బందులు తలెత్తవచ్చు. మానసిక ఒత్తిడి వంటి సమస్యలతో బాధపడవచ్చు. ఈ సమయంలో జీవిత భాగస్వామితో విభేదాలు తలెత్తవచ్చు.
7/ 8
కుంభం (Aquarius) : ఈ రాశి వారికి మంచి సమయం వస్తుంది. ఆఫీసులో సమయం సౌకర్యవంతంగా ఉంటుంది. అధికారులు, సహోద్యోగుల సహకారం కూడా లభిస్తుంది. వ్యాపారంలో లాభంతో, మీరు మీ వ్యాపారాన్ని విస్తరించవచ్చు.
8/ 8
Disclaimer: ఈ ఆర్టికల్‌లో ఇచ్చినది ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్లో సేకరించిన సమాచారం మాత్రమే. దీన్ని న్యూస్ 18 నిర్ధారించట్లేదని గమనించగలరు.