ఆచార్య చాణక్యుడు గొప్ప పండితుడు మాత్రమే కాదు మంచి ఉపాధ్యాయుడు కూడా. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తక్షశిల విశ్వవిద్యాలయం నుండి విద్యను అభ్యసించిన ఆయన నైపుణ్యం కలిగిన దౌత్యవేత్త, వ్యూహకర్త, ఆర్థికవేత్త కూడా. ఆచార్య చాణక్యుడు తన జీవితంలో అసహ్యకరమైన పరిస్థితులను ఎదుర్కొన్నాడు కానీ ఎన్నడూ భయపడలేదు,తన లక్ష్యాన్ని మరువలేదు. ఆచార్య చాణక్యుడు...డబ్బు, ఆరోగ్యం, వ్యాపారం, వైవాహిక జీవితం, సమాజం, జీవితంలో విజయం వంటి అన్ని విషయాలపై తన అభిప్రాయాన్ని తెలియజేశాడు. ఒక వ్యక్తి తన జీవితంలో ఆచార్య చాణక్యుడి మాటలను అనుసరిస్తే వారు జీవితంలో ఎప్పుడూ తప్పు చేయరు,విజయవంతమైన స్థితికి చేరుకోగలరు. ఆచార్య చాణక్యుడు తన నీతిశాస్త్రంలో డబ్బుకు సంబంధించిన ముఖ్యమైన విషయాలను కూడా ప్రస్తావించాడు.
ప్రతి ఒక్కరికి జీవితంలో కనీస అవసరాలు తీర్చుకోవడానికి డబ్బు అవసరం. అటువంటి పరిస్థితిలో, కష్టాన్ని నమ్ముకోవడం నుండి పూజలు చేసే వరకు, ఇంటిని సుసంపన్నం చేయడానికి ప్రజలు చేయవలసినవన్నీ చేస్తారు, అయితే మీ కొన్ని అలవాట్లు ఇంట్లో డబ్బును కూడా ప్రభావితం చేస్తాయి అని మీకు తెలుసా. ఆచార్య చాణక్యుడు నీతిశాస్త్రంలో డబ్బుకు సంబంధించిన ముఖ్యమైన విషయాలను కూడా ప్రస్తావించాడు. చాణక్య నీతి ప్రకారం, ఒక వ్యక్తి ఎలాంటి చర్యల నుండి డబ్బు పొందాలి, డబ్బుతో ఉన్నప్పుగు ఎలా ప్రవర్తించాలో తెలుసుకోండి.