ఉగాది వచ్చిందంటే చాలు… పంచాగ శ్రవణాలు. నూతన సంవత్సర ఫలాలు. అన్ని పేపర్లు, టీవీ చానెళ్లు హోరెత్తిపోతాయి.
2/ 8
పంచాంగం గురించి తెలుసుకుంటే మన జాతకం ఎలా ఉంది? మనకు భవిష్యత్ లో ఎలాంటి ప్రభావాలు చోటుచేసుకుంటాయి అనే వాటి మీద మనకు అవగాహన కలిగిస్తుంది.
3/ 8
పంచాంగం- పంచ అంటే ఐదు. ఐదు అంగాలతో తయారైందే పంచాంగం. అవి తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనే ఐదు అంశాలు ఉంటాయి.
4/ 8
కర్ణాటకలో అతి పురాతనమైన పంచాంగం గురించి తెలుసా..? ఉత్తర కర్ణాటకలో బగ్గోన పంచాంగం గురించి తెలియనవారుండరు.
5/ 8
బగ్గోన పంచాంగానికి 142 సంవత్సరాల చరిత్ర ఉంది.అయితే ఈ వంశం 300 సంవత్సరాలకు పైగా పంచాంగాన్ని రాస్తోందని చెబుతారు.
6/ 8
ఉత్తర కన్నడలోని గోకర్ణలోని రథ వీధిలో నివసించే వెంకటరమణ పండిట్, ఆయన అక్క జయ పండిట్ ఇప్పటికీ ఈ పంచాంగం రాస్తున్నారు. ఈ జంట పంచాంగం రాయడంలో చాలా పేరు సంపాదించింది.
7/ 8
ఆసక్తికరమైన విషయమేమిటంటే జయ పండిట్ స్త్రీ అయినప్పటికీ జ్యోతిష్యం నేర్చుకుని తన తమ్ముడితో కలిసి పంచాంగం రాయడంలో ముందంజలో ఉన్నారు.
8/ 8
ఓ మహిళ నేతృత్వంలోని ఈ పంచాంగానికి రాష్ట్ర వ్యాప్తంగా విపరీతమైన డిమాండ్ ఉంది.