ఉద్యోగాలు చేసేవారు ఉత్తరం, తూర్పు లేదా ఈశాన్య దిక్కులకు అభిముఖంగా కూర్చోవాలని వాస్తు శాస్త్రం చెబుతోంది. అలా చేయడం వల్ల కెరీర్ గాడిన పడుతుంది. మేనేజర్ లేదా ఎంప్లాయర్ రూమ్ నైరుతి లేదా పశ్చిమ- నైరుతిలో ఉండాలి. ఉద్యోగులు తూర్పు, ఉత్తరం లేదా ఈశాన్య రూమ్‌లను ఉపయోగించవచ్చు. కొత్త కెరీర్ అవకాశాలు పొందడానికి ఉత్తర దిశ అనుకూలంగా ఉంటుందని వాస్తు శాస్త్రం పేర్కొంది.
* ఆగ్నేయ దిశలో దీపం : సహజ మొక్కలు, పువ్వులను ఆగ్నేయ దిశలో ఉంచండి. మీ కెరీర్లో మరింత ముందుకు సాగటానికి ఆగ్నేయ దిశలో సుగంధ దీపం లేదా కొవ్వొత్తిని కూడా వెలిగించవచ్చు. వర్క్ డెస్క్ దగ్గర ఓపెన్ స్పేస్ ఉండేలా చూసుకోండి. ఎటువంటి గందరగోళం లేకుండా దాన్ని చక్కగా మెయింటెన్ చేయాలి. ఆర్గనైజ్ డెస్క్ అనేది ఆర్గనైజ్ మైండ్‌తో సమానంగా ఉంటుందని వాస్తు శాస్త్రం చెబుతోంది.
* వెనుక వైపు గోడ : జ్ఞానం పొందేందుకు తూర్పు దిశ అనుకూలంగా ఉంటుంది. ఏకాగ్రత, సంకల్పం కోసం ఈశాన్య దిశ అనువైనది. కూర్చున్నప్పుడు గోడ వెనుక భాగంలో ఉండేలా చూసుకోండి. ఇది సపోర్ట్, బలాన్ని అందిస్తుంది. గ్యాడ్జెట్స్ నుంచి గరిష్ట ప్రయోజనం పొందేందుకు ల్యాప్‌టాప్, ఫోన్స్, ఛార్జర్స్, ఐప్యాడ్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులను ఆగ్నేయ దిశలో ఉంచండి.
* చెక్కతో చేసిన ఫర్నిచర్ : దక్షిణ దిశలో కిటికీ ఉండకూడదు. గది ప్రకాశవంతంగా ఉండాలి. ఇందుకు సహజ వెలుతురు వచ్చేలా చూసుకోండి. విద్యార్థులైతే ఆశీర్వాదం పొందడానికి సరస్వతీ దేవి ఫోటోను తూర్పు దిశ గోడపై వేలాడదీయండి. డెస్క్, టేబుల్, కుర్చీ వంటి ఫర్నిచర్ చెక్కతో చేసినవై ఉండాలి. డెస్క్ దీర్ఘచతురస్త్రం లేదా చతురస్రాకారంలో మాత్రమే ఉండాలి. గుండ్రంగా లేదా ఇతర విభిన్న ఆకృతుల్లో డెస్క్ లేకుండా చేసుకోండి. ఇలాంటి చర్యలు తీసుకుంటే భవిష్యత్‌లో మీ కెరీర్ పూలబాటలో నడుస్తుంది.