వృషభ రాశి : ప్రేమించిన వాళ్లకి అండగా నిలుస్తారు. తమ పార్టనెర్ చెప్పేది ఎంతో ఓర్పుతో వింటారు. ప్రేమ జీవితంలో చాలా ప్రాక్టికల్‌గా ఉంటారు. అయితే వీళ్లు కాస్త మొండిగా ఉంటారు. ఇక మార్పులు అవసరమైనప్పటికీ వారి ఆలోచనలకు కట్టుబడి ఉంటారు. ఏదైనా అంశంపై నిర్ణయం తీసుకునే ముందు చాలా ఆలోచిస్తారు. తమ కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా నిలుస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)
మిథునం: గాసిప్స్, రొమాన్స్, సరదాలు ఈ రాశి వ్యక్తుల లక్షణాలు. ప్రేమ జీవితానికి సంబంధించినంత వరకు.. వీళ్లు చాలా కలలు కంటారు. ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉంటారు. అయితే ప్రేమను వ్యక్తీకరించే విషయానికి వస్తే వారి మనస్సులో ఎప్పుడూ కన్ఫూజన్ ఉంటుంది. తమ భావాలను లవర్‌కు చెప్పడానికి సంకోచిస్తారు. ఎక్కువసేపు ఒంటరిగా ఉండలేరు. అందుకే లవర్‌తో మాట్లాడటానికి ఎక్కువగా ఇష్టపడతారు. అయితే చిన్న చిన్న విషయాలు కూడా వారికి ఆందోళన కలిగిస్తాయి. అవే వాళ్ల సంతోషకరమైన క్షణాలను పాడు చేస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
కన్య : ఈ రాశి వాళ్లు చాలా తెలివైనవారు. ప్రేమకు సంబంధించిన విషయాల్లో కూడా ఎంతో ఆలోచించిన తర్వాతే ఏ అంశంపైనైనా ముందుకు వెళ్తారు. తమ ప్రేమను వ్యక్తపరిచే విషయంలో నిజాలే చెబుతారు. చాలా నిజాయితీగా తమ ప్రేమికుడి పట్ల అంకితభావంతో ఉంటారు. వారి ప్రేమ విధానం కూడా భిన్నంగా ఉంటుంది. చాలా సిగ్గుపడే మనస్తత్వం వీళ్లది. (ప్రతీకాత్మక చిత్రం)
తుల రాశి : సమాజాన్ని, కుటుంబాన్ని కలిపి ఉంచడం వీరి నైజం. అందుకే వీరు తమ ప్రేమ జీవితం గురించి సీరియస్‌గా, తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు. అన్ని లక్షణాలతో నిండిన తమ ప్రేయసిని చూడటానికి ఇష్టపడతారు. వారి ప్రేమ బంధంలో వివాదం తలెత్తితే.. దానిని త్వరగా పరిష్కరిస్తారు. అవకాశం దొరికినప్పుడల్లా తమ ప్రేమ భాగస్వామిని నవ్వించడానికి ఇష్టపడతారు. (ప్రతీకాత్మక చిత్రం)
వృశ్చికం: వీరి భావాలు చాలా సున్నితంగా ఉంటాయి. ఇది సెక్సీయెస్ట్ రాశిగా కూడా పరిగణిస్తారు. వ్యక్తిగత విషయాలను కూడా చాలా సీరియస్‌గా తీసుకుంటారు. ఈ రాశి వారు ప్రేమించేటప్పుడు ఎక్కువగా మాట్లాడటానికి ఇష్టపడతారు. అవసరమైనప్పుడు తమ లవర్ కోసం ఉన్నదంతా ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉంటారు. లవ్‌లో కూడా నిజాయితీపరులనే ఇష్టపడతారు. అయితే ఈ రాశి వాళ్లకి ఒక మైనస్ ఉంది. ఎక్కువ అనుమానం వ్యక్తం చేస్తుంటారు. ఎవరైనా తమ హృదయాన్ని గాయపరిస్తే ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధంగా ఉంటారు. (ప్రతీకాత్మక చిత్రం)
ధనుస్సు రాశి : ఈ రాశి వారు స్వభావరీత్యా కుతూహలం కలిగి ఉంటారు. వీరు తమ ఆలోచనలలో తాత్వికంగా ఉంటారు. ధనుస్సు రాశి వారి గురించి మంచి విషయం ఏమిటంటే, వారు ప్రేమలో పడిన తర్వాత వారు సంబంధాన్ని ఎక్కువ కాలం కొనసాగించడానికి పూర్తిగా కట్టుబడి ఉంటారు. వీరు తమ ప్రేమ జీవితాన్ని ఉత్సాహభరితంగా ఉంచుతారు. తమ లవర్‌తో అటూ ఇటూ తిరగడం, చిట్ చాట్ చేయడం వీరికి చాలా ఇష్టం. అయితే వీళ్లకి మైనస్‌లు కూడా ఉన్నాయి. వాళ్లు చాలా హామీలు ఇస్తారు.. కానీ దానిని నెరవేర్చే సమయం వచ్చినప్పుడు వెనుకడుగు వేస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)
మకర రాశి :ప్రేమ సంబంధాలను చాలా సీరియస్‌గా తీసుకుంటారు. వీరు ప్రేమలో ఎప్పుడూ తొందరపాటు చూపరు. జాగ్రత్తగా ఆలోచించిన తర్వాతే అడుగు వేస్తారు. తమ ప్రేమను వ్యక్తపరిచేటప్పుడు వెనకాడరు. వీళ్లు సాధారణంగా తమ లవర్‌పై కోపం తెచ్చుకోరు..కానీ కోపం వచ్చినప్పుడు ఇష్టం వచ్చినట్లు ఆరుస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)
కుంభ రాశి : కుంభ రాశి వారిని అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. వీరు చాలా సైలెంట్. అయితే లోతుగా ఆలోచించిన తర్వాతే ఒక దృఢమైన నిర్ణయానికి వస్తారు. ఈ రాశి వారు తమ ప్రేమను ప్రేమించిన వాళ్లకి అంతా ఈజీగా చెప్పలేరు. అయితే ఒకసారి లవ్ ఓకే ఐపోతే చాలా ఓపెన్‌గా ఉంటారు. తమ లవర్‌కి ఇచ్చిన హామీలను ఎట్టి పరిస్థితుల్లోనూ నెరవేర్చడం వీరి లక్షణం. ఇక లవర్ చెప్పేది ఓపికగా వింటారు. అయితే ఈ రాశి వారు షార్ట్ టెంపర్ పీపుల్. (ప్రతీకాత్మక చిత్రం)