YSR With Krishna : దివంగత ముఖ్యమంత్రి వైయస్ఆర్‌తో సూపర్ స్టార్ కృష్ణ రేర్ పిక్స్..

YSR With Krishna : టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ,ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై.యస్.రాజశేఖర్ మధ్య మంచి మిత్రత్వం ఉంది. వీళ్లిద్దరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కృష్ణ కాంగ్రెస్ పార్టీ నుంచి లోక్‌సభ సభ్యులుగా పనిచేసారు. మరోవైపు వైయస్ఆర్ కూడా ఎంపీగా, ఎమ్మెల్యేగా పనిచేసారు. అంతేకాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండు సార్లు పనిచేసారు. అంతేకాదు ఉమ్మడి ఏపీలో ఫుల్ టర్మ్ ముఖ్యమంత్రిగా పనిచేసి మళ్లీ గెలిచిన ఏకైక సీఎంగా రికార్డులకు ఎక్కారు. ఈ రోజు మహానేత వైయస్ఆర్ జయంతి సందర్భంగా ఇటు వైయస్ఆర్ అభిమానులతో పాటు కృష్ణ ఫ్యాన్స్ వీళ్లిద్దరు కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి వారి అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. (Twitter/Photo)