వైఎస్సార్ రైతు భరోసా పేరుతో ఏపీ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయంగా ఏటా 3 విడతల్లో రూ.13,500 అందిస్తున్నది. ఇందులో ఏడాదికి రూ.6000 కేంద్రం ఇచ్చే పథకానివి కాగా, మిగతా డబ్బులను ఏపీ సర్కార్ కలిపి రైతుల ఖాతాల్లోకి వేస్తున్నది. అందుకే పథకానికి వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ అనే పేరు కొనసాగిస్తున్నారు.
తెలంగాణ వార్తలు, పీఎం కిసాన్ స్కీమ్, యూనిక్ ఐడీ, రైతులకు స్కీమ్స్" width="1200" height="800" /> ఈ పథకాలు పొందేందుకు ఈ ఏడాది ఇప్పటివరకు 50,10,275 మంది అర్హత పొందారు. వీరిలో 47,98,817 మంది భూ యజమానులు కాగా, 1.20 లక్షల మంది కౌలుదారులు, 91,458 మంది అటవీ భూ సాగుదారులు ఉన్నారు. మూడేళ్లతో పోలిస్తే ఈ ఏడాది కౌలుదారులతో పాటు అటవీ సాగుదారుల సంఖ్య గణనీయంగా పెరిగింది. వీరి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
రెండో ఏడాది లబ్ధి పొందిన వారిలో 50,04,874 మంది భూ యజమానులు, 69,899 మంది కౌలుదారులు, 84,272 మంది అటవీ భూ సాగుదారులున్నారు. మూడో ఏడాది 50,66,241 మంది భూ యజమానులు, 89,877 మంది కౌలుదారులు, 82,399 మంది అటవీ భూ సాగుదారులున్నారు. వీరు గత మూడేళ్లలో రూ.20,117.59 కోట్ల మేర లబ్ధి పొందారు. (అన్నీ ప్రతీకాత్మక చిత్రాలు)