వైఎస్సార్ రైతు భరోసా పేరుతో ఏపీ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయంగా ఏటా 3 విడతల్లో రూ.13,500 అందిస్తున్నది. ఇందులో ఏడాదికి రూ.6000 కేంద్రం ఇచ్చే పథకానివి కాగా, మిగతా డబ్బులను ఏపీ సర్కార్ కలిపి రైతుల ఖాతాల్లోకి వేస్తున్నది. అందుకే పథకానికి వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ అనే పేరు కొనసాగిస్తున్నారు. కాగా ఈ విడత లబ్దిదారుల సంఖ్య భారీగా తగ్గింది.
వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ యోజన కింద ఈ ఏడాది ప్రతి రైతుకు రూ.13,500 దక్కనుండగా, ఈ ఏడాది మొదటి విడత డబ్బులు రూ.7,500 ఈ నెలలోనే రైతుల ఖాతాల్లోకి జమ కావాల్సి ఉండగా సోమవారం నాడు రైతుల అకౌంట్లలోకి రూ.5500 వేశారు. ఈనెల 31న పీఎం కిసాన్ డబ్బులు మరో రూ.2000 రావాల్సి ఉంది. కానీ లబ్దిదారుల జాబితా నుంచి ఏకంగా 2.28 లక్షల మంది గల్లంతయ్యారు.
నిజానికి పీఎం కిసాన్ పథకంలోనూ భారీ ఎత్తున వడపోతలు జరుగుతున్నాయి. ఒకే భూమిపై ఇద్దరు లబ్ది పొందుతుండటం, అర్హత లేకున్నా లిస్టులో పేరుండటం లాంటివి గుర్తించిన యంత్రాంగం రాష్ట్రాల వారీగా జాబితాలను సవరించగా ఒక్క కేరళలోనే 3.2లక్షల మంది పేర్లు తొలగించారు. యూపీలోనూ ఈ సంఖ్య భారీగా ఉంది. కాగా, పీఎం కిసాన్ అనుబంధంగా ఏపీలో నడుస్తోన్న వైఎస్సార్ రైతు భరోసా పథకంలోనూ ఈ విడత ఏకంగా 2.28 లక్షల మంది పేర్లను తొలగించారు.
వైఎస్సార్ రైతు భరోసా కింద 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అర్హత పొందిన 50,10,275 రైతు కుటుంబాలకు తొలి విడతగా ఈ నెలలో రూ.3,758 కోట్ల పెట్టుబడి సాయం అందిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. మొత్తం 64.07 లక్షల రైతు కుటుంబాలకు మేలు జరుగుతుందని, వీరిలో 15.37లక్షల కౌలురైతు కుటుంబాలు కూడా ఉన్నారని అని బడ్జెట్లో జగన్ సర్కారు చెప్పినట్లు కాకుండా లబ్దిదారుల సంఖ్య 50.10 లక్షలకు పడిపోయింది.
జిల్లా ఉంగుటూరులోని గణపవరంలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం జగన్ కంప్యూటర్ మీట నొక్కి రైతుల ఖాతాల్లోకి డబ్బులు వేశారు. ఈసారి 2.28లక్షల పేర్లను తొలగించగా, 50.10లక్షల మందికే సాయం అందనుంది. ఇందులో భూమి ఉన్న రైతు కుటుంబాలు 47.85 లక్షలు కాగా, అటవీ భూమి హక్కుదారులు 92 వేల మంది, కౌలు రైతులు లక్షా 43 వేల మందికే రైతు భరోసా వర్తింపచేస్తోంది.
ఏపీలో రైతు భరోసా అందుకుంటోన్న అబ్దిదారుల సంఖ్య భారీగా తగ్గింది. 2021-22లో 52.38లక్షలుగా ఉన్న లబ్దిదారుల సంఖ్య ఇప్పుడు 2.28లక్షలు తగ్గిపోయి 5.10లక్షలకు చేరిది. తాజాగా పేర్లు తొలగించినవాళ్లలో 1.43 లక్షల మంది కౌలు రైతులే అని అధికారిక గణాంకాల ద్వారానే వెల్లడవుతోంది. పేర్లు కోతకు గురైన 2.28 లక్షల మందికి ఈనెల 31న పీఎం కిసాన్ యోజన డబ్బులు రూ.2000 కూడా అందే అవకాశాలు లేనట్లు తెలుస్తోంది.
తెలంగాణ వార్తలు, పీఎం కిసాన్ స్కీమ్, యూనిక్ ఐడీ, రైతులకు స్కీమ్స్" width="1200" height="800" /> భూమి ఖాతా ఉన్న రైతు చనిపోయినా, లబ్ధిదారులు జీఎస్టీ, ఆదాయపన్ను చెల్లిస్తున్నా, ఒకే రేషన్ కార్డులో ఇద్దరు రైతులు ఉన్నా, రైతు కుటుంబంలో ఉన్నత చదువుతున్నా, నవరత్నాల్లోని పథకాల ద్వారా లబ్ధి చేకూరుతున్నా.. రైతు భరోసాను నిలిపివేసినట్లు తెలిసింది. దీని ఫలితంగానే ఈ ఏడాది 2.28లక్షల రైతు కుటుంబాలు రైతు భరోసా-పీఎం కిసాన్ కు దూరమైనట్లు తెలుస్తోంది.
రైతు భరోసా డబ్బులు తొలిరోజు (సోమవారం) 20 నుంచి 30 శాతం మందికే జమ అయిందని, కౌలు రైతుల విషయంలో కన్ఫ్యూజన్ నెలకొందని, జగన్ మీట నొక్కింది రూ.7500లకా, లేక రూ.5500లకా అనే అంశంపై స్పష్టత లేదని ఆంధ్రజ్యోతి ఒక కథనాన్ని రాసింది. రైతు భరోసా లబ్దిదారుల తొలగింపుపై ఏపీ సర్కారు వివరణ ఇవ్వాల్సి ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)