పీఎం కిసాన్ స్కీమ్ 11వ ఇన్స్టాల్మెంట్, పీఎం కిసాన్ స్కీమ్ ఇకేవైసీ, పీఎం కిసాన్ స్కీమ్ ఇకేవైసీ ఆన్లైన్, పీఎం కిసాన్ స్కీమ్ లబ్ధిదారుల జాబితా, పీఎం కిసాన్ స్కీమ్ స్టేటస్" width="1200" height="800" /> ఏపీ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా అమలవుతోన్న వైఎస్సార్ ఉచిత పంట బీమా పథకం మరో విడత క్లెయిమ్ పంపిణీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. 2021 ఖరీఫ్‌కు సంబంధించి జగన్ సర్కారు కనీవినీ ఎరుగని రీతిలో రైతులకు భారీగా బీమా సొమ్ము అందజేస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం 2022 లబ్ధిదారుల జాబితాలను ఇప్పటికే ఆయా గ్రామాల్లోని ఆర్బీకేల్లో ప్రదర్శించింది ప్రభుత్వం. సత్యసాయి జిల్లాలోని చెన్నే కొత్త పల్లి (సీకే పల్లి)లో జరిగే ప్రధాన కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ పాల్గొంటారు. ఆ వేదికపైనుంచే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతు లబ్దిదారుల ఖతాల్లోకి సీఎం బీమా సొమ్మును ఆన్ లైన్ ద్వారా జమ చేయనున్నారు. కొందరికి చెక్కులనూ పంపిణీ చేస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)
పంటల బీమా పథకం క్లెయిమ్ పంపిణీ కోసం ముఖ్యమంత్రి జగన్ పాల్గొనే సభ కోసం సీకే పల్లిలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంగళవారం ఉదయం 9 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి 10.50 గంటలకు చెన్నేకొత్తపల్లి చేరుకుంటారు. 11.15 గంటల నుంచి 12.45 గంటల వరకు బహిరంగ సభ, రైతులతో ముఖాముఖిలో పాల్గొంటారు. తిరిగి మధ్యాహ్నం 2.50 గంటలకు తాడేపల్లికి చేరుకుంటారు. (ప్రతీకాత్మక చిత్రం)
ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టం జరిగినప్పుడు పైసా భారం పడకుండా రైతులకు పరిహారం అందించే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం 2019 జూలై 8న వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ–పంటలో నమోదే ప్రామాణికంగా నోటిఫై చేసిన ప్రతీ పంటకు, ప్రతీ ఎకరాకు ఉచిత బీమా కల్పిస్తోంది. క్లైయిమ్ సెటిల్మెంట్లు, చెల్లింపుల బాధ్యతను కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
గత హయాంలో ఏటా సగటున 20 లక్షల మంది రైతులు, 23.57 లక్షల హెక్టార్లు బీమా పరిధిలోకి వస్తే, తమ పాలనలోని గడిచిన మూడేళ్లలో సగటున 60.35 లక్షల మంది రైతులు, 53.86 లక్షల హెక్టార్లు బీమా పరిధిలోకి వచ్చాయని జగన్ సర్కారు చెబుతోంది. వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం కింద 2019–20 సీజన్లో పైసా భారం పడకుండా 49.81 లక్షల మంది రైతులకు చెందిన 45.96 లక్షల హెక్టార్లకు బీమా చేయించగలిగామని ప్రభుత్వం పేర్కొంది. (ప్రతీకాత్మక చిత్రం)
2020–21లో 71.30 లక్షల మంది రైతులకు సంబంధించి 61.75 లక్షల హెక్టార్లలో పంటలు బీమా పరిధిలోకి వచ్చాయని, గతంతో పోల్చుకుంటే రైతుల పరంగా 198.57 శాతం, విస్తీర్ణ పరంగా 128.51 శాతం పెరిగింద ప్రభుత్వ ప్రకటనలో పేర్కొన్నారు. టీడీపీ హయాంలో క్లెయిమ్స్ ఐదేళ్లలో 30.85 లక్షల మంది రైతులకు రూ.3,411.2 కోట్లు దక్కితే, గత మూడేళ్లలోనే 29.05 లక్షల మంది రైతులకు రూ.3,707.02 కోట్ల మేర బీమా అందించిందని తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)
6.19 లక్షల మంది రైతుల రూ.715.84 కోట్ల గత ప్రభుత్వ బకాయిలను సైతం చెల్లించి సీఎం వైఎస్ జగన్ పెద్ద మనసు చాటుకున్నారని, తాజాగా ఖరీఫ్ –2021కు సంబంధించి 15.61 లక్షల మంది రైతులకు రూ.2,977.82 కోట్లు చెల్లించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని, మొత్తంగా గత మూడేళ్లలో 44.61 లక్షల మంది రైతులకు రూ.6,684.84 కోట్ల మేర లబ్ధి చేకూర్చినట్లయిందని ప్రకటనలో పేర్కొన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
ఒక సీజన్‌కు సంబంధించి ఇంత పెద్ద మొత్తంలో పంటల బీమా పరిహారం అందించిన చరిత్ర గతంలో లేదని, 2021 ఖరీఫ్ సీజన్లో రికార్డు స్థాయి విస్తీర్ణంలో పంటలు సాగవ్వగా.. అకాల వర్షాలు, తుపాన్లు వరదల వల్ల వ్యవసాయ, ఉద్యాన పంటలకు అపార నష్టం వాటిల్లిందని, సీఎం జగన్ ఆదేశాల మేరకు నష్టపోయిన ప్రతీ రైతుకు పరిహారం అందించాలన్న సంకల్పంతో ప్రత్యేక బృందాల ద్వారా గ్రామ స్థాయిలో అంచనా వేసిన పంట నష్టం ఆదారంగా పరిహారం అందించేందుకు ఏర్పాట్లు చేశామని వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ చేవూరు హరి కిరణ్ తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)