YSR Cheyutha: ఆంధ్రప్రదేశ్ మహిళలకు మరో గుడ్ న్యూస్ చెప్పారు సీఎం జగన్ మోహన్ రెడ్డి.. వరుసగా మూడో ఏడాది వైఎస్సార్ చేయూత పథకానికి సంబంధించిన మొత్తాన్ని లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసేందుకు సిద్ధం అయ్యారు. అది కూడా చంద్రబాబు నాయుడు అడ్డా కుప్పం నుంచి ఈ నగదు విడుదల చేస్తుండడం ఆసక్తికరంగా మారింది.
కుప్పంలో కేవలం చేయూత నగదు విడుదల చేయడమే కాదు. కుప్పంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గోనున్నారు. సీఎం జగన్ మోహన్‌రెడ్డి చేతుల మీదుగా కుప్పం పురపాలక సంఘం అభివృద్ధికి సంబంధించి రూ.66 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన చేయనున్నారు. 11 రూపాయల కోట్లతో నిర్మించిన ప్రభుత్వ కార్యాలయాల సముదాయం ప్రారంభోత్సవానికి అధికారులు ఏర్పాట్లు చేశారు.
23 సెంటిమెంట్
అయితే 22నే మొదట జగన్ కప్పం టూర్ ఉంటుంది అనుకున్నా..? 23కు వాయిదా పడడం వెనుక సెంటిమెంట్ ఉందంటూ ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే చంద్రబాబు సీఎంగా ఉన్నసమయంలో 23 మంది ఎమ్మెల్యేలను టీడీపీలో జాయిన్ చేసుకున్నారు. ఇక 2019 ఎన్నికల్లో 23వ తేదీని విడుదలైన ఫలితాల్లో.. చంద్రబాబు నాయుడు పార్టీ కేవలం 23 మంది ఎమ్మెల్యేలను మాత్రం గెలుచుకుంది. దీంతో అప్పటి నుంచి దేవుడు స్క్రిప్ట్ అంటే ఇదే అంటూ.. టీడీపీని 23 సెంటిమెంట్ తో జగన్ భయపెడుతున్నారు. అందులో భాగంగానే కుప్పంలో 23వ తేదీనే ఆయన పర్యటిస్తున్నారు.