తూర్పు గోదావరి జిల్లా (East Godavari District) లో డిగ్రీ విద్యార్థిని అదశ్యం కలకలం రేపుతోంది. పిఠాపురంకు చెందిన విద్యార్థిని కాకినాడ (Kakinada) లోని ఓ కాలేజీలో డిగ్రీ చదువుతోంది. సోమవారం మధ్యాహ్నం ఆటోలో బయలుదేరిన విద్యార్థిని ఆ తర్వాత కనిపించలేదు.
Np తూర్పు గోదావరి జిల్లా (East Godavari District) లో డిగ్రీ విద్యార్థిని అదశ్యం కలకలం రేపుతోంది. పిఠాపురంకు చెందిన విద్యార్థిని కాకినాడ (Kakinada) లోని ఓ కాలేజీలో డిగ్రీ చదువుతోంది. సోమవారం మధ్యాహ్నం ఆటోలో బయలుదేరిన విద్యార్థిని ఆ తర్వాత కనిపించలేదు.
2/ 6
ఐతే యువతి ఇంటికి రాకపోవడం, ఆమె మొబైల్ స్విచ్ ఆఫ్ రావడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు.
3/ 6
విద్యార్థిని ఆటో ఎక్కినట్లు తన ఫ్రెండ్ కు మెసేజ్ చేసింది. ఆటో డ్రైవర్ తేడాగా ఉన్నాడని.. స్లోగా వస్తోందని.. 2.15 కల్లా వచ్చేస్తానని.. బస్ స్టాప్ నుంచి నడిచిరావాలి అంటూ స్నేహితురాలితో చాటింగ్ చేసింది.
4/ 6
జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు పర్యవేక్షణలో ఒక డీఎస్పీ, ఆరుగురు ఇన్ స్పెక్టర్ స్థాయి అధికారులతో ఆరు ప్రత్యేక బృందాలు యువతి ఆచూకీ కోసం గాలిస్తున్నాయి. ఇప్పటికే యువతి ప్రయాణించిన మార్గంలో సీసీ కెమెరా ఫుటేడ్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
5/ 6
యువతి 2.15 కల్లా వస్తానని చాటింగ్ లో పేర్కొనగా.. రెండున్నర దాటినా ఇంకా ఆటోలోనే ఉన్నట్లు సీసీ ఫుటేజ్ ద్వారా అర్ధమవుతోంది. యువతి చాటింగ్ చేసిన ఫ్రెండ్ తో పాటు సీసీ ఫుటేజ్ లభ్యమైన ప్రాంతాల్లోని ఆటో డ్రైవర్లను పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.
6/ 6
ఆలాగే యువతి కిడ్నాప్ కు గురైందా.. లేక కావాలనే వెళ్లిపోయిందా..? కుటుంబ కలహాలు, ప్రేమ వ్యవహారాల వంటి కోణాల్లోనూ దర్యాప్తు కొనసాగుతోంది. ఐతే యువతి చాటింగ్ ను బట్టి చూస్తే ఆటో డ్రైవర్ ఏదైనా అఘాయిత్యానికి పాల్పడ్డాడా అనే అనుమానాలు బలపడుతున్నాయి.