ఈ ఏడాది సంక్రాంతి పండుగకు వివిధ ప్రాంతాలు, విదేశాల్లో ఉంటున్న గ్రామస్తులు స్వగ్రామానికి వచ్చారు. వీరిలో వయసుకొచ్చిన ఆడపిల్లలతో పాటు మహిళలు కూడా ఉన్నారు. మూడు రోజుల పాటు అంతా సరదాగా గడిపి తిరిగి వెళ్లిపోయారు. ఐతే గ్రామానికి వచ్చి వెళ్లిన వారికి సరిగ్గా నెలన్నర రోజుల తర్వాత అనుకోని ఘటన ఎదురైంది. (ప్రతీకాత్మకచిత్రం)
స్వగ్రామానికి వచ్చి విదేశాలకు వెళ్లిన మహిళల్లో ఒకరి ఫోటో పోర్న్ వెబ్ సైట్లో దర్శనమిచ్చింది. తల్లి ఫోటో సోషల్ మీడియా ద్వారా పోర్న్ సైట్ లో ఉన్నట్లు గుర్తించిన ఓ యువకుడు.. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దర్యాప్తు చేసిన పోలీసులకు కూడా ఫ్యూజులు ఔట్ అయ్యే పరిస్థితి. (ప్రతీకాత్మకచిత్రం)
గ్రామానికి చెందిన కొందరు బీటెక్ విద్యార్థులు.. సంక్రాంతికి వచ్చిన యువతులు, మహిళల ఫోటోలను వారికి తెలియకుండా తీశారు. అందంగా అలంకరించుకున్నవారివి.. చూడ్డానికి బాగున్నవాళ్లందరి ఫోటోలను తీసిపెట్టుకున్నారు. పండగ సందడి ముగిసి అంతా తిరిగి వెళ్లిపోయిన తర్వాత వారిలోని కన్నింగ్ ఐడియాలను బయటపెట్టారు. (ప్రతీకాత్మకచిత్రం)
యువతులు, మహిళల ఫోటోలను పోర్న్ వెబ్ సైట్లకు అమ్మి సొమ్ము చేసుకున్నారు. అలా వందల మంది ఫోటోలను అశ్లీల వెబ్ సైట్లకు అమ్మినట్లు గుర్తించారు. గ్రామానికి చెందిన ఇద్దరు యువతుల ఫోటోలతో కూడిన వీడియోలను కూడా గర్తించారు. అంతేకాదు యువతుల ఫోటోలతో సోషల్ మీడియా ఖాతాలు ఓపెన్ చేసి అబ్బాయలతో చాటింగ్ చేసేవారని.. వారి నుంచి కూడా డబ్బులు తీసుకున్నట్లు తెలిసింది. (ప్రతీకాత్మకచిత్రం)