ప్రస్తుతం వాయవ్య దిశగా గంటకు 15 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న వాయుగుండం.. 12 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశాలున్నట్లు అదికారులు తెలిపారు. ఇది క్రమంగా ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ ఊనెల 5వ తేదీ నాటికి శ్రీలంక తూర్పు తీరానికి ఉత్తరవాయవ్యంగా పయనిస్తూ తదుపరి 36 గంటల్లో పశ్చిమ వాయవ్య దిశగా పయనించనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. (ప్రతీకాత్మకచిత్రం)
అలాగే దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 50-60 కిమీ వేగంతో బలమైన గాలులు వీస్తాయని.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని.. ఇప్పటికే వెళ్లిన వారు వెంటనే తిరిగి వచ్చేయాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. అంతేకాదు తీవ్రవాయుగుండం దృష్ట్యా ఏపీలోని విశాఖపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం ఓడరేవుల్లో ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. (ప్రతీకాత్మకచిత్రం)