ఈ రోజుల్లో మానవ సంబంధాలు చాలావరకు వక్రమార్గంలో వెళ్తున్నాయి. పెళ్లై కుటుంబాలున్నవారు కూడా తాత్కాలిక సుఖాల కోసం అక్రమ సంబంధాల వెంట పరుగులు పెడుతున్నారు. కొన్నిసార్లు వావివరసలు మరిచి వ్యవహరిస్తున్నారు. మనం ఏం చేస్తున్నాం.. ఎవరితో వ్యవహారం నడుపుతున్నామనేది కూడా గాలికి వదిలేసి వివాహ బంధాన్ని అపహాస్యం చేస్తున్నారు. (ప్రతీకాత్మకచిత్రం)
ఇటీవల పశ్చిమగోదావరి జిల్లాలో అమానుషం జరిగింది. తల్లితండ్రులు విడిపోవడంతో తండ్రి దగ్గరే ఉంటూ అతడికి, బాబాయికి వంట చేసిపెడుతూ వారి బాగోగులు చూస్తున్న బాలికపై తండ్రి, బాబాయిలే అత్యాచారానికి పాల్పడ్డారు. ఏడాదికా వారి అకృత్యాలు భరించిన బాలిక చివరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు మృగాళ్లిద్దరినీ అరెస్ట్ చేశారు. (ప్రతీకాత్మకచిత్రం)