వివరాలలోకి కర్నూలు జిల్లా నంద్యాలలోని ప్రియాంక నగర్ కు చెందిన ఈశ్వర్ రెడ్డికి 14 ఏళ్ల క్రితం శివపార్వతితో పెళ్లైంది. గతంలో పలు వ్యాపారాలు చేసిన ఈశ్వర్ రెడ్డి నష్టాలు రావడంతో అప్పులపాలయ్యాడు. అప్పుల వాళ్ల ఒత్తిడి పెరిగిపోవడంతో ఐదేళ్ల నుంచి వేరే ప్రాంతంలో ఉంటూ అప్పుడప్పుడూ ఇంటికి వచ్చి వెళ్తుండేవాడు. (ప్రతీకాత్మకచిత్రం)
అదే సమయంలో ఈశ్వర్ రెడ్డిని చంపేయాలని భావించిన నాగరాజు.. అతడి ముగ్గురు స్నేహితులతో కలిసి కర్రలతో దాడి చేశాడు. ఇందుకు శివపార్వతి కూడా సహకరించింది. స్థానికులు వచ్చి కేకలు వేయడంతో అక్కడి నుంచి పారిపోయారు. గాయపడిన ఈశ్వర్ రెడ్డిని ఆస్పత్రికి తరలించగా ఆ తర్వాత కోలుకున్నాడు. అనంతరం అతడి భార్య శివపార్వతితో పాటు ప్రియుడు నాగరాజు, అతడి స్నేహితులపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. (ప్రతీకాత్మకచిత్రం)
గుంటూరు జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది. మంగళగిరి మండలం తాడేపల్లికి చెందిన నాగరాజు నెల్లూరు జిల్లా బిట్రగుంటకు చెందిన షెమా సోనీని ఎనిమిదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇటీవల దంపతులిద్దరూ పొన్నూరులో కాపురం పెట్టారు. ఈ క్రమంలో వీరు నివశిస్తున్న కాలనీలో ఉండే ఓ యువకుడితో సోనీకి పరిచయం ఏర్పడింది. (ప్రతీకాత్మకచిత్రం)