కేవలం జిల్లేడు ఆకు, రేగిపండ్లతో మంత్రం పఠిస్తూ మాత్రమే స్నానం చేయాలి. దీంతో ఏడుజన్మల పాపం తొలగిపోతుంది. ఇది ఈశ్వరుడి వరం. యద్యజ్జన్మ కృతం పాపం మయా సప్తసు జన్మసు తస్య రోగంచ శోకంచ సమస్తం హంతు సప్తమీ రథ సప్తమి నాడు స్నానం చేసేటప్పుడు జిల్లేడు ఆకు, రేగిపండు తల మీద ఉంచుకుని ఈ శ్లోకం పఠిస్తే ఏడు జన్మల నుంచి వెన్నంటి వస్తున్న సమస్త పాపాలు నశిస్తాయి..
మరో విధానం.. ఈరోజు సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవాలి. స్నానం చేసి, లేలేత సూర్యకిరణాలు వెలువడుతున్న సమయంలో ఆరుబయట లేదా ఇంటి టెర్రస్ పై కూర్చోని 7 సార్లు ఈ శ్లోకం పఠించండి. భానో భాస్కర మార్తాండ చండరష్మి దివాకర:! ఆయురారోగ్యమైశ్వర్యం ప్రసీద భగవన్ మునే!! ఆ తర్వాత బ్రహ్మ విష్ణు స్వరూపోసి సర్వ దేవ మయోహ్యసి వ్యాధిం వినాశయ క్షిప్రం భాస్కరాయ నమో నమ.
సాధారణంగా రథసప్తమి అంటే ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి (Sri Surya Narayana Swamy) కరుణ కోసం.. వివిధ రకాల్లో పూజలు చేస్తారు. అలాంటి రథసప్తమి వేడుకలను పండగ వాతావరణంలో ఘనంగా జరుపుకోనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కాకుళం జిల్లా (Srikakulam District) లోని అరసవల్లి సూర్య దేవ ఆలయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా రథసప్తమి వేడుకలను నిర్వహించనున్నారు.
గత రెండున్నరేళ్లు కరోనా భయాలతో భక్తుల సంఖ్య తగ్గింది. కానీ ఈ సారి భారీగా భక్తులు వస్తారని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. ఎంతమంది భక్తులు వచ్చినా.. వారికి ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అరసవిల్లి రథసప్తమి వేడుకలు నిర్వహించనున్నట్లు, క్యూలైన్లు, ప్రసాదాల పంపిణీ తదితర చర్యలు చేపట్టాలని నిర్ణయించారు.