Famous Temple for who worried about pregnant: మీకు పిల్లలు లేరా? అయితే ఒక్కసారి ఈ కొండపై నుంచి జారితే.. మీకు పిల్లలు పుట్టడం ఖాయం. సంతానం లేని వారు ఒక్కసారి ఆ కొండపై నుంచి జారితే సంతానం కలుగుతుందనేది తరతరాలుగా వస్తున్న భక్తుల నమ్మకం. అందుకే ఏటా సంక్రాంతి పండుగ రోజు భక్తులు ఆ కొండకు తరలివస్తారు.
శ్రీకాకుళం జిల్లాలోని పలాసకి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. తెల్లబంగారంగా పేరొందిన జీడిపప్పు ఉత్పత్తికి ప్రముఖ వాణిజ్య కేంద్రం పలాస ప్రాంతం. కేవలం వ్యాపార పరంగానే కాదు.. ఆధ్యాత్మిక పరంగానూ పలాసకు మంచి పేరు ఉంది. అయితే పలాసలోని ఉదయపురంలో డేకురు కొండకు దశాబ్ధాల చరిత్ర ఉంది. సుమారు 5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ కొండ ఓ ప్రత్యేకతను సంతరించుకుంది.
ప్రభుత్వ పరంగా ఈ డేకురు కొండకు ఎటువంటి ఆదరణ లేనప్పటికి ఉదయపురం ప్రాంతానికి చెందిన వారే ఇక్కడి ఆలయాల వ్యవహారం చూస్తున్నారు. ప్రతీ ఏడాది సంక్రాంతి పండుగ రోజులలో వారు ఇక్కడ ప్రత్యేకించి ఉత్సవాలు నిర్వహిస్తుండడం ఆనవాయితీగా వస్తుంది. దీంతో సంక్రాంతి పండుగ రోజు అధిక సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఈ ప్రాంతం సందడిగా ఉంటుంది.