కేవలం వర్షాలు మాత్రమే కాదు.. ఈ రోజు ఒకటి లేదా రెండు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని రాష్ట్ర వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే స్వల్పంగా ఈదురు గాలులు కూడా వీసే అవకాశం ఉందని వెల్లడించింది. ఎండతో పాటు వానలు అంటే కాస్త జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.