Rain Alert: తెలుగు రాష్ట్రాలను ఇప్పట్లో వానలు వదిలే అవకాశం కనిపించడం లేదు.. మధ్యలో ఒకటి రెండు రోజులు చిన్న విరామం ఇచ్చినా.. మళ్లీ విరుచుకుపడుతున్నాడు వరుణుడు. గత కొన్ని రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాలో ఎడతెరిపి లేని వానలు కురుస్తూనే ఉన్నాయి. ఇప్పుడు మరో మూడు రోజుల పాటు భారీ వానలు పడతాయని హెచ్చరికలు అందుతున్నాయి.
ఉత్తర బంగాళాఖాతంలో 2022 ఆగస్టు 19 తేదీ నాటికి అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో పాటు ఉత్తర -దక్షిణ ద్రోణి రాయలసీమ నుండి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు తమిళనాడు అంతర్భాగంగా సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తులో విస్తరించి ఉంది. ఈ నేపథ్యంలో ఏపీలో రానున్న మూడు రోజులకు వాతావరణ సూచనలను చేశారు.
రాయలసీమలోనే వాయుగుండ ఎఫెక్ట్ కనిపించనుంది. రేపు, ఎల్లుండి తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఈ రోజు, రేపు ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఎల్లుండి తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.