S jagadesh, visakhaptnam, News 18. Mr India Body Building: అతడిలో అద్భుత ప్రతిభ ఉంది.. అతడు ఎన్నుకున్న రంగంలో అద్బుతాలు చేసే సత్తా ఉంది.. అందుకు తగ్గ పట్టుదల, శ్రమ, అంకిత భావం అన్ని ఉన్నాయి. కానీ ఒక్కో మెట్టు ముందుకు వేయాలి అంటే.. అందుకు డబ్బులు అవసరం.. కానీ దిగువ మధ్యతరగతికి చెందిన అతడికి అది సాధ్యం కాలేదు.. ఇక రంగాన్ని వదిలేయాలని మదన పడ్డాడు.. కానీ ఇప్పుడు అనుకున్న లక్ష్యాలను అధిగమించాడు.. దేశం గర్వించే వాడిగా నిలిచాడు.. ఎలా సాధ్యమైందంటే..?
ఈ ఘనతకు అతడి స్నేహితులే కారణం. కష్టాల కడలి ఈదుతూ తనకంటూ ఓ గుర్తింపు ఉండాలి అనే లక్ష్యంతో బాడి బిల్డింగ్ లో ముందుకెళ్తున్నాడు ఆ యువకుడికి మంచి స్నేహితులు ఉన్నారు.. అతడి ప్రతిభను వారు గుర్తించారు.. ఎలాగైనా స్నేహితుడి విజయం చూడాలని నిర్ణయించుకున్నారు. దీంతో అంతా చందాలు వేసి మరి ఉన్నత స్థాయికి చేరేలా తోడ్పాటు అందించారు.
స్నేహితుల సహకారంతో పలు పోటీల్లో పాల్గొన్ని జాతీయ స్థాయి గోల్డ్ మెడల్ సాధించాడు ప్రపంచ స్థాయి పోటీల్లో గెలిపే లక్ష్యం గా కటోర సాధన చేస్తున్నాడు ఇప్పుడు. విశాఖపట్నం జిల్లా రెల్లి వీదిలో గల ఓ మధ్యతరగతి కుటుంబం లో పుట్టిన చెన్న సంతోష్. చిరు ప్రాయంలోనే నాన్న జిమ్ చేస్తుంటే తాను చూసి చేసేవాడు. అలా బాడీ బిల్డర్ గా మారి.. ఆ రంగం వైపు ఆసక్తితో అడుగులు వేశాడు.
అయితే స్నేహితులు అందరూ తన ప్రతిభను చూసి ఉన్నత స్థాయికి చేరేలా తాము సహకరిస్తామని ఒక్కొక్కరు చందాలు వేసుకొని పోటీలకు పంపేవారు. అప్పటి నుంచి ఎక్కడ పోటీ అయినా.. స్నేహితుడిపై నమ్మకంతో చందాలు వేసి మరీ పోటీలకు పంపిస్తూ వచ్చారు. అయితే అతడు కూడా తన స్నేహితులు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఎప్పుడు వమ్ము చేయలేదు.
ఇప్పటికే స్థానికంగా పోటీలకు హాజరు అవుతూ 32 మెడల్స్ గెలుచుకున్నాడు. ఇటీవల పూణే లో ఏప్రిల్ 18 2022 న నిర్వహించిన mr india 2022 ఇండియన్ బాడి బిల్డింగ్, ఫిట్ నెస్ ఫెడరేషన్ ఆర్గైజేషన్ ఐబీబీఎఫ్ఎఫ్( ibbff) & ఏఎఫ్బీఎప్(Afbf) ఆధ్వర్యం లో 55 కేటగిరీ లో మిష్టర్ ఇండియా (mr. India) గోల్డ్ మెడల్ సంతోష్ సొంతం చేసుకున్నాడు.
తమ మిత్రులు సహకారం లేకపోతే ఈ స్థాయికి వెళ్ళేవాడిని కాదంటూ సంతోష్ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. శరీర దృఢత్వం గురించి తమ కోచ్ తాడే పల్లి శ్రీనివాస రావు , బాడి బిల్డింగ్ అధ్యక్షులు సల్మాన్ రాజు కూడా ఎంతో సేవలు అందించి తనను ఇంత స్థాయికి వెళ్ళే విధంగా తీసుకు వెళ్లారని ధన్యవాదాలు చెప్పాడు. ముఖ్యంగా తన స్నేహితులు మాయ్య నీలకంఠం , ఉమా , అప్పు , అభి , మణి , ఆటో రాజన్న , చిన్నోడు , ఫుడ్ బాల్ కోచ్ నరేష్ , తేజ , నాగేంద్ర , కిరణ్ , మహేష్ , జోగిరాజు హోటల్ GM సందీప్ రెడ్డి కి ఎప్పటికీ రుణపడి ఉంటాను అంటున్నాడు.
బాడీ బిల్డింగ్ అంటే కర్చుతో కూడుకున్న పని , పోషకాలతో కూడిన ఆహారం సమయానుసారం ఆహారం ఉండాల్సిందే.. సాధించాలనే పట్టుదల కృషి ఉన్నప్పటికీ సంతోష్ ని పేదరికం వెనక్కి నెట్టుతుంది. ఓ ప్రవేట్ ఉద్యోగం చేస్తూ శరీర దృఢత్వం కి అవసరం అయ్యే చాలి చాలని పోషకాహారం తీసుకుంటున్నాడు. దాతలు సహకరిస్తే మిష్టర్ ఇండియా కాదు (Mr India ) కాదు , మిష్టర్ వరల్డ్ (mr world )సాధిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు.