బంగాళాఖాతంలో తుఫాను ఏర్పడుతుందని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసినప్పటికీ, అది ఎక్కడ తీరం దాటుతుంది.. తీవ్రత ఎంత ఉంటుంది అన్న విషయాలపై మాత్రం క్లారిటీ రావడం లేదు. కానీIMD తెలిపిన వివరాల ప్రకారం, రాబోయే 24 గంటల్లో ఆగ్నేయ, దానిని ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది అంటున్నారు.
ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ అక్టోబర్ 22న ఉదయం.. మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ఇది రాబాయే.. 48 గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారే అవకాశముంది. అది తుఫాన్‌గా మారితే.. ఆంధ్రా, ఒడిశా సమీపంలో తీరం దాటితే తెలుగు రాష్ట్రాలలో తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ముఖ్యంగా దీని ప్రభావంతో రాష్ట్రంలో కోస్తా ఆంధ్ర, రాయలసీమల్లో గురు, శుక్రవారాల్లో ఉరుములు, మెరుపులతో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ నెల 20, 21, 22 తేదీల్లో సముద్ర తీరంలో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం సూచించింది.
రాబోయే నాలుగు రోజుల్లో ఉత్తరాంధ్రలో తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది అలాగే దక్షిణ కోస్తా వ్యాప్తంగా ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది .