తాజాగా విశాఖ మహానగరంకు మరో ప్రత్యేక ఆకర్షణగా అండర్ వాటర్ టన్నెల్ నిలుస్తుందని నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి పేర్కొన్నారు. బీచ్ రోడ్డులోని ఏయూ మైదానంలో ఏర్పాటైన మీనా లోకం నగరానికి మణిహారం కాగలదని ఆమె భావించారు. మంగళవారం ఇక్కడ సందర్శించిన మేయర్ హరి వెంకట కుమారి ఇక్కడి స్టాల్స్‌ను తిలకించారు.
అక్వేరియంలో మాత్రమే చేపల్ని చూసిన నగరవాసులకు ఇది కొత్త అనుభూతిని అందిస్తుందన్నారు. ఈ మీనా లోకం విశాఖ నగరానికి మరొక మణిహారంగా ఉందన్నారు. నిర్వాహకులు ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి ఏర్పాటు చేసిన మీనా లోకం విదేశాల్లో మాత్రమే చూసే అవకాశం ఉందన్నారు. అటువంటి మత్స్య సంపదను విశాఖ నగరంలో ప్రత్యక్షంగా అందరి కోసం ఏర్పాటు చేసిన నిర్వాహకులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లుగా చెప్పారు.
చిన్నారులకు ఎంతో విజ్ఞానాన్ని అందించే విధంగా దీన్ని తీర్చిదిద్దడం అభినందనీయం అని మేయర్ హరి వెకంట కుమారి పేర్కొన్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి విశాఖ నగరానికి వచ్చే ఇది ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందనడంలో సందేహం లేదన్నారు. ప్రతి వ్యక్తి కుటుంబంతో కలిసి ఆనందంగా గడిపే వేదికగా ఈ ఎగ్జిబిషన్ నిలవడం శుభపరిణామం అని ఆమె భావించారు.