Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తగ్గేదే లే అన్నారు.. జైలుకెళ్లేందుకు సిద్ధమే అంటూ వైసీపీకి సవాల్ విసిరారు. తాను వైజాగ్ నువీడి వెళ్లేది లేదని తేల్చి చెప్పేశారు. దీంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది.
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బస చేసిన హోటల్ నోవాటెల్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. విశాఖ పోలీసులు పవన్ ఇచ్చిన గడువు సమయం ముగిసింది. సాయంత్ర 4.30 లోపు విశాఖను వీడి హైదరాబాద్ వెళ్లిపోవాలి అంటూ పోలీసులు నోటీసులు ఇచ్చారు.
2/ 8
ముందు అనుకున్న విధంగా జనవాని కార్యక్రమం ఏర్పాటు చేసిన పోర్టు కళావాణి దగ్గరకు చేరుకున్న ఆయన.. పోలీసుల తీరుకు నిరసగా.. జనవానిని రద్దు చేశారు. తరువాత మీడియాతో మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన పోలీసులు పవన్ కు నోటీసులు ఇచ్చారు.
3/ 8
ఈ నెల 30వ తేదీ వరకు.. విశాఖలో ర్యాలీలకు, సమావేశాలకు అనుమతి లేదని.. అలాంటి నిర్వహిస్తే శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని.. ముఖ్యంగా పవన్ చూసేందుకు బారీగా అభిమానులు వస్తుండడంతో ఇబ్బంది కలుగుతోందని పోలీసులు ఆయనకు చెప్పారు.
4/ 8
పోలీసుల ఆంక్షల నేపథ్యంలో సాయంత్రం 4.30 గంటలలోపు విశాఖను వీడి వెళ్లాలని.. పవన్ తో సహా జనసేన నేతలంతా హైదరాబాద్ వెళ్లిపోవాలి అంటూ ఆ నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు.
5/ 8
ఆ నోటీసులను చదవి వినిపించిన పవన్ కళ్యాణ్.. ప్రజల సమస్యలు వినడానికి వచ్చిన వారిని వెళ్లిపోమనడం ఏంటని ప్రశ్నించారు. పోలీసులపై గౌరవంతో మౌనంగా ఉంటున్నామని.. తాను ప్రజా సమస్యలు వినడానికి వచ్చేనని.. అందుకే విశాఖ వీడి వెళ్లేది లేదని తేల్చి చెప్పేశారు.
6/ 8
ఆ తరువాత నోవాటెల్ హోటల్ కు చేరుకున్న ఆయన.. తమ లీగల్ టీంతో మాట్లాడి.. ఆయన ఇక్కడ నుంచి వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు. దీంతో పోలీసులు భారీగా నోవాటెల్ హోటల్ కు చేరుకున్నారు..
7/ 8
నోటీసులు ఇచ్చిన పవన్ వైజాగ్ వీడి వెళ్లకపోవడంతో.. ఆయన్ను బలవంతంగా అదుపులోకి తీసుకుని ఎయిర్ పోర్టుకు తరలిస్తారనే ప్రచారం జరుగుతోంది. అందుకే పోలీసులు అక్కడకు చేరుకుని ఉంటారని జనసైనికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
8/ 8
జైలుకు వెళ్లడానికైనా సిద్ధం.. విశాఖ వీడేది లేదని పవన్ స్పష్టం చేశారు. దీంతో ఆయనకు మద్దతుగా భారీ సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలను నోవాటెల్ కుచేరుకున్నారు. పోలీసులు, ప్రభుత్వం తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.