P Anand Mohan, Visakhapatnam, News18. Eatable Tea Cups: టీ తాగండి ఆ కప్పులే తినండి వినడానికి కొత్తగా ఉన్నా ఇది నిజం. ఐస్ క్రీమ్ తిన్నాక కోన్ ను ఏలా తింటామో, టీ కప్పును కూడా అలాగే తినేయవచ్చు. ఇప్పడు ఈ టీ కప్పు విశాఖలో కొత్త ట్రెండ్ సృష్టిస్తోంది. టీ కప్పు తినేందుకే టీ అభిమానులు క్యూ కడుతున్నారు.
జయలక్ష్మి భర్త అనారోగ్యానికి గురై మంచాన పడ్డారు. కరోనా మహామ్మరి తన ప్రైవేట్ ఉద్యోగాన్ని చిదిమేసింది. అయినా అధైర్య పడకుండా వినిత్నూ ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఫ్లాస్టిక్ రహిత టీ కప్పులు తయారి ప్రారంభించింది. ప్రారంభంలో కొన్ని కొన్ని ఇబ్బందులు ఎదురైన, వాటి అన్నింటిన్ని అధిగమించి జయలక్ష్మి విజయలక్ష్మిగా మారిపోయింది.
జయలక్ష్మి తన దగ్గర ఉన్న కొద్దిపాటి డబ్బుతో పాటు కెనరా బ్యాంకు రుణంతో ఎడిబుల్ టీ కప్స్ యంత్రాలను కొనుగోలు చేసి, శ్రీహర్ష ఎంటర్ప్రైజెస్ పేరిట పరిశ్రమను స్థాపించారు. ఈ యంత్రాలలో మైదా పిండితో మాత్రమే కప్పులు తయారీ చేసే అవకాశం ఉంటుంది. అయితే మైదాతో కప్పుల తయారీ వల్ల చిన్న పిల్లలకు జీర్ణవ్యవస్థకు సంబంధించిన అనారోగ్యం కలుగుతుందని గుర్తించి, ప్రత్యామ్నాయ కప్పుల తయారీకి అనేక ప్రయోగాలు చేశారు.
తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, చత్తీస్గడ్, గుజరాత్, రాజస్థాన్, ఢిల్లీ వంటి రాష్ట్రాలకు టీ కప్పులను ఎగుమతి చేస్తూ పదిమందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఫాస్టిక్ నిషేదం ఉండడం వలన ఆయా రాష్ట్రాల నుండి ఆర్డర్స్ అధికంగా ఉన్నాయని, ప్రజలు నుండి మంచి స్పందన ఉందని, చేసే ప్రతిపని ఇష్టంగా చేస్తే విజయం సాధిస్తామని జయలక్ష్మి అంటున్నారు.