Anand Mohan Pudipeddi, Visakhapatnam, News18. Family School:పాఠశాలైనా, ఆఫీసైనా, మరేదైనా ఒకే కుటుంబానికి చెందిన వారు.. అది కూడా మూడు తరాలకు చెందిన వారు ఒకే చోటకు రోజూ వెళ్లి, రావడం సాధారణ విషయం కాదు.. కాకీ ఓ స్కూల్ లో మాత్రం అధి సాధ్యమైంది. ఎలా అంటే.. 60 ఏళ్ల మల్లేశ్వరరావు.. కుమారుడు 33 ఏళ్ల ప్రవీణ్, అతని కుమారుడు 7 ఏళ్ల అనిరుద్ద్.. వీరు ముగ్గురూ మూడు తరాలకు ప్రతినిధులు.
సాధారణంగ చాలా చోట్ల ఒకే ఇంటిలో అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు, భార్యభార్తలో ఒకే చోట పని చేయడం కనిపిస్తుంది. కానీ తాత, అతని కుమారుడు, మనవడు కూడా ఒకే చోటకు వెళ్లడం అంటే నిజంగా ఆశ్చర్యం కలిగించే అంశమే. అందుకే ఈ విషయం వారికి కూడా కాస్త ఆశ్చర్యంగా ఉంది అంటున్నారు హెడ్ మాస్టర్ మల్లశ్వరరావు.. వారీ సొంతరులోనే ఇలా మూడు తరాల వారు ఒకే పాఠశాలలో పని చేయడం చాలా అరుదైన విషయంగా చెప్పుకుంటున్నారు.
1968-1973 వరకు మల్లేశ్వరరావు ఇదే పాఠశాలలో ప్రాధమిక విద్య పూర్తి చేశారు. తరువాత 1986లో ఉపాధ్యాయ వృత్తిలో చేరారు. ఆయన కుమారుడు ప్రవీణ్ ఈ పాఠశాలలోనే 1994-1999 వరకు చదువుకున్నారు. 2010లో డీఎస్సిలో ఉత్తీర్ణత సాధించి, ప్రభుత్వ టీచరయ్యారు. ప్రస్తుత పాఠశాలకు రాక ముందు ఇద్దరు వేర్వేరు పాఠశాలల్లో పని చేసినా, 2021లో జరిగిన బదిలీ ప్రక్రియలో తండ్రి మల్లేశ్వరరావు, కుమారుడు ప్రవీణ్ కు సొంతవూరైన ఏ. కోడూరుకే బదిలీ అయ్యారు.
ఏ. కోడూరు గ్రామం వారి సొంతూరు కావడం.. ఎక్కడ పని చేసినా బదిలీ ప్రక్రియలు జరిగేటప్పుడు ఇక్కడికి వస్తే బాగుంటుందని ఆ కొడుక్కి అనిపించేంది. అతడు ఊహించినట్టే 2021లో జరిగిన బదిలీ ప్రక్రియలో వారికి ఉన్న పాయింట్ల ఆధారంగా ఇద్దరికి సొంతూరైన ఏ. కోడూరు మండల ప్రాధమిక పాఠశాలకే బదిలీ అయ్యారు. తండ్రి, కొడుకులు ఒకే పాఠశాలలో అని సంతోషం అనిపించింది. ఇప్పుడు చిన్నారి కూడా అదే స్కూల్లో చేరడం అక్కడ సన్షేషన్ గా మారింది.