Used Cooking Oil: సాధారణంగా ఇళ్లలో డీప్ ఫ్రై ఐటమ్ ఏది చేసినా.. ఆ మిగిలిన నూనెను రెండోసారి వాడే ప్రయత్నం చేశారు.. అయితే కొంతమంది పదే పదే అదే నూనెను వాడుతుంటారు.. ఇక హోటళ్లు, రెస్టారెంట్ల పరిస్థితి మరీ దారుణం. వంట నూనెలను ఒకటి, రెండు సార్లు మాత్రమే వినియోగించాలి. కానీ చాలా చోట్ల పదే పదే మరిగించి వాడుతున్నట్టు ఏపీలో పలు హోటల్స్ పై ఫిర్యాదులు అందుతున్నాయి.
ఎవరైనా అలా పదే పదే మరిగించిన నూనెను వాడడం చాలా ప్రమాదకరం.. ఎందుకంటే అధిక ఉష్ణోగ్రత వద్ద తరచూ వంట నూనెలను వినియోగించడంతో మానవ జీర్ణ ప్రక్రియపై ప్రభావం పడుతుంది. అందుకే ఎవరైనా ఇలా వంట నూనెను పదే పదే వాడుతున్నట్టు తెలిస్తే సమచారం ఇవ్వాలి అంటున్నారు అధికారులు.. ఇప్పటికే పలు హోటల్స్ లో దీనిపై అవగాహన కూడా కల్పించారు.
అయితే సాధారణంగా మిగిలిపోయిన వంటనూనెను బయట పారబోయడం, తోపుడుబండి వ్యాపారులకు విక్రయించడం చేస్తుంటారు కొందరు. మరికొందరు డబ్బుపై అత్యాశతో అలాంటి నూనెను ప్యాకింగ్ చేసి మరీ విక్రయిస్తున్నారు కూడా. కల్తీ నూనెను విక్రయించకుండా నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మిగులు వంట నూనెను బయోడీజిల్ తయారీ కంపెనీలకు విక్రయించేలా మార్గదర్శకాలు విడుదల చేసింది.
సాధారణంగా హోటల్ వ్యాపారులు ప్రతి నెలా వంటనూనె వాడకం, మిగిలిన నూనె వినియోగం వివరాలను పెదవాల్తేరులోని ఆహార భద్రత శాఖ కార్యాలయానికి పంపించాల్సి ఉంటుంది. వంటనూనె అధిక పరిమాణంలో వినియోగించే హోటళ్లు ముందుగా ఆహార భద్రతా శాఖ నుంచి లైసెన్సులు తీసుకోవాలి. అప్పుడే కల్తీనూనెకు చెక్ పెట్టవచ్చని అధికారులు అంటున్నారు.
రాష్ట్రంలో ఇప్పటికే ఐదు కంపెనీలు బయోడీజిల్‌ను తయారు చేస్తున్నాయి. ఒకసారి వాడిన వంట నూనెను పదే పదే వినియోగించడం ఆరోగ్యానికి హానికరం. ఇటువంటి ఆయిల్‌తో చేసిన ఆహారాన్ని తింటే క్యాన్సర్, రక్తపోటు, కాలేయ సంబంధ వ్యాధులు వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో బయో డీజిల్ ఉత్పత్తి కోసం పెద్దాపురం ప్రాంతానికి చెందిన ఓ కంపెనీ నగరంలోని పెద్ద హోటళ్ల నుంచి వినియోగించిన నూనెను సేకరిస్తోంది.
సరఫరా దెబ్బతినడంతో భారత్ వంట నూనెల ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. ఇప్పటికే సన్ ఫ్లవర్ ధర చుక్కల్లో చేరగా, గడిచిన వారం రోజులుగా పామాయిల్, పల్లినూనె, రైస్ బ్రౌన్ తదితర వంట నూనెల రేట్లు పైపైకి పోతున్నాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం మరికొంత కాలం కొనసాగితే ఆహార సంక్షోభం తప్పదా? అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. వివరాలివి..