Vizag: విశాఖలో ఘనంగా డేజ్లింగ్ బ్యూటీస్ ఈవెంట్... అదరగొట్టిన అమ్మాయిలు..!
Vizag: విశాఖలో ఘనంగా డేజ్లింగ్ బ్యూటీస్ ఈవెంట్... అదరగొట్టిన అమ్మాయిలు..!
విశాఖలో ఘనంగా డేజ్లింగ్ బ్యూటీస్ ఈవెంట్ జరిగింది. 2023 సంవత్సర మొట్ట మొదటి ఈవెంట్ మిరుమిట్లు గొలిపే లైట్ మరియు సౌండ్స్ తో , అందమైన మోడల్స్ తో , చిట్టి పొట్టి చిన్నారులతో , సింగర్స్ మరియు డాన్సర్స్ తో అదరగొట్టారు.
విశాఖ మరో ఈవెంట్‌కు వేదిక అయ్యింది. అంతర్జాతీయ ఈవెంట్ డైరెక్టర్ వీరుమామ ఆధ్వర్యంలో 2023 సంవత్సర మొట్ట మొదటి ఈవెంట్ మిరుమిట్లు గొలిపే లైట్ మరియు సౌండ్స్ తో, అందమైన మోడల్స్ తో, చిట్టి పొట్టి చిన్నారులతో, సింగర్స్ మరియు డాన్సర్స్ తో అదరగొట్టారు.
2/ 10
డేజ్లింగ్ బ్యూటీస్ పేరిట నిర్వహించిన ఈ ఈవెంట్ లో మెగా ఫైనల్ లో 12 మంది మోడల్స్ , పూర్తి వెస్ట్రన్ లుక్ తో అలరించారు. భారత దేశం తో పాటు ప్రపంచ దేశ ఫాషన్ దుస్తులతో రాంప్ పై నడిచి అలరించారు.
3/ 10
ప్రతి ఒక్కరు ఇంతకు ముందు జరిగిన షోస్ లో విజేతలను ఎంపిక చేసి ఈ రాంప్ వాక్ నిర్వహించారు. ఆరు నెలల పాటు వివిధ విభాగాలలో పోటీలు నిర్వహించి పిల్లల ప్రత్యేక కేలండర్ ను మరియు ఫాషన్ రంగం లో లిటిల్ పుటిల్ అనే సరికొత్త బ్రాండ్ ను ఆవిష్కరించారు.
4/ 10
ఈ బ్రాండ్ ఆవిష్కరణ ఫారిన్ పిల్లల తో చేయించడం ఒక హైలైట్. ప్రముఖ టీవీ ఛానళ్లలో తలపడిన సింగర్స్ కాశ్యప్, విజయ పాటలు అలరించాయి. వంశిక నృత్యం ఔరా అన్పించింది.
5/ 10
ప్రతి రౌండ్ లో మోడల్స్ తమదేనా శైలి లో అదరగొట్టారు. స్టైల్, ఫాషన్ రంగాలలో అడుగుపెట్టాలి అనుకునే వారికి ప్రోత్సాహంగా ఈ కార్యక్రమం చేపట్టామని వీరుమామ తెలిపారు.
6/ 10
గౌరవ అతిథిగా హాజరైన జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి వైజాగ్ జర్నలిస్ట్ లు ఫోరమ్ అధ్యక్షుడు గంట్ల శ్రీను బాబు మాట్లాడుతూ ఈ పోటీలో పాల్గొన్న వారందరూ విజేతలు కావడం అభినందనీయం అన్నారు.
7/ 10
ఇటువంటి చిన్నారుల పుట్టిన రోజు కాలెండర్ లు తన చేతుల మీదుగా ఆవిష్కరణ చెయ్యడం సంతోషం కలిగించిందని ఆయన తెలిపారు.
8/ 10
ఈ ఈవెంట్లో వైజాగ్‌కు చెందిన అమ్మాయిలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. విజేతలకు బహుమతులు అందించారు.
9/ 10
విశాఖ ఈ మధ్యకాలంలో ఎన్నో ఈవెంట్లకు వేదిక అవుతుంది. ఇక్కడ గ్రాండ్‌గా పెద్ద పెద్ద ఈవెంట్లు నిర్వహించడంపై విశాఖ వాసులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
10/ 10
వైజాగ్ డాజ్లింగ్ బ్యూటీస్ ఈవెంట్లో అమ్మాయిలతో పాటు చిన్నారులు కూడా పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించారు.