P Anand Mohan, Visakhapatnam, News18. Tomato Price: ఓవైపు వేసవిలో మండిస్తున్న ఎండలతో తగ్గిన పంటల దిగుబడితో రోజు రోజుకీ కూరగాయలు ధరలు పెరిగిపోతుంటే.. మరోవైపు నాన్ వెజ్ ప్రియులకు షాక్ ఇస్తూ చికెన్, మటన్ ధరలు కూడా చుక్కలను తాకుతున్నాయి. పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలెండర్ సహా నిత్యావసర వస్తువు ధరలు పెరుగుతూ.. సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఏమి కొనేటట్లు లేదు.. ఏమి తినేటట్లు లేదంటూ.. వాపోతున్నారు.
రష్యా-ఉక్రెయిన్ ల మధ్య జరిగిన వార్ కారణంగా అన్నీ వస్తువుల పై ధరలు భారీగా పైకి కదిలాయి.చిన్న వస్తువుల నుంచి వంట గ్యాస్ వరకూ అన్నిటి పై ప్రభుత్వం ధరలను భారీగా పెంచింది.నిత్యావసర ధరలు అయితే మండి పోతున్నాయి..ఎండలు పెరిగే కొద్ది కూరగాయల
ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. ఇప్పుడు ఏక టమాటా.. పెట్రోల్ తో పోటీ పడే పరిస్థితి నెలకొంది.
అయితే ప్రభుత్వం ధరలు తగ్గే ప్రయత్నం చేపట్టామని చెబుతూ వస్తోంది. రైతు బజార్లలో ప్రత్యేకంగా అమ్మకాలు చేపట్టింది. ఇతర ప్రాంతాల నుంచి టమాటాలను దిగుమతి చేసింది. దీంతో రేట్లు తగ్గుతాయని అంతా ఆశించారు.. గత రెండు రోజులు సైతం కొన్ని చోట్ల 70 నుంచి 80 రూపాయల వరకు కూడా అమ్మారు దీంతో.. ఇక టమాటా దిగి వస్తుందని ఆశించారు.. కాని.. పరిస్థితి రివర్స్ అయ్యింది..
సామర్లకోట, పెద్దాపురం మార్కెట్లలో 15కిలోల బాక్స్ టమోటాల ధర గరిష్ఠంగా 1150 రూపాయల వరకూ పలికింది. నాణ్యతను బట్టి బాక్స్ టమోటాలను 900 రూపాయల నుంచి 1150 రూపాయల వరకు కొనుగోలు చేశారు. ఇక తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో
మండుటెండలు, ఎడతెరిపిలేని వర్షాల కారణంగా దిగుబడులు తగ్గడం, ధరలు పెరుగుదలకు కారణమయ్యాయని వ్యాపారులు చెబుతున్నారు.
ముఖ్యంగా కూరలో పచ్చి మామిడి పొడిని ఒక టీ స్పూన్ వేస్తే అచ్చం టమాటా లాగే రుచి వస్తుందట. నీటిలో ఉసిరి ముక్కలను నానబెట్టి మెత్తగా పేస్టులా చేసుకుని కూరలో వాడినా కూడా టమాటా రుచి వస్తుందట. టమాటకు బదులుగా కాస్త పుల్లగా ఉండే పెరుగును కూడా
వాడవచ్చు. అంతేకాదు కూర ఉడికేటప్పుడు కాస్తా చింతపండు గుజ్జు వేస్తే టమాటో తో పని ఉండదట.