ప్రతి ఏడాది కార్తీక మాసంలో పార్వేటి మండపం దగ్గర కార్తీక వనభోజనాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. కానీ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కార్తీక వనభోజనాన్ని టీటీడీ రద్దు చేసింది. అయితే ఈ కరోనా నుంచి తేరుకున్న తరువాత వేడుకగా వనభోజనం నిర్వహించాలనుకున్న వానల కారణంగా రద్దు చేయాల్సి వచ్చిందని టీటీడీ వివరణ ఇచ్చింది.
విశాఖ నగరంలోని ఎంవిపి కాలనీలో గల టిటిడి కళ్యాణ మండపంలో మీడియా సమావేశంలో షణ్ముఖ్ కుమార్ తెలిపారు. సాయంత్రం 5.30 గంటలకు రామకృష్ణ బీచ్ కాళీ మాత అమ్మవారి గుడి ఎదురుగా సాగర తీరాన వైభవంగా కార్తీక మహా దీపోత్సవం నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానంద సరస్వతి స్వామివారు మంగళాశాసనాలు అందిస్తారని వెల్లడించారు.
టీటీడీ చైర్మన్ వైవి.సుబ్బారెడ్డి, ఈవో ఏవి ధర్మారెడ్డి పాల్గొంటారని తెలిపారు. విష్ణుసహస్రనామం, శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి స్తోత్రాలు పారాయణం చేస్తారని చెప్పారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా శ్రీ ఏబి.బాలకొండల రావు బృందంతో నృత్యం, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులతో సంకీర్తనల ఆలాపన జరుగుతాయన్నారు.
అంతకు ముందు టీటీడీ ఎస్ఇ-2 జగదీశ్వర్ రెడ్డి నేతృత్వంలోని అధికారుల బృందం రామకృష్ణ బీచ్ దగ్గర గల దీపోత్సవం వేదిక పనులను పరిశీలించారు. ఆర్డీవో శ్రీ హుస్సేన్, పోలీసు అధికారులు పాల్గొన్నారు. మీడియా సమావేశంలో దాతలు రాజేష్, శ్రీ హిమాంశుప్రసాద్, టీటీడీ ఎస్ఇ-2 శ్రీ జగదీశ్వర్ రెడ్డి, పిఆర్ఓ డా.టి.రవి, డిఇ శ్రీ రవిశంకర్ రెడ్డి, డిఎఫ్ఓ శ్రీ శ్రీనివాస్, విజివో శ్రీ మనోహర్ పాల్గొన్నారు.