ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు. ఏవో కాకరపువ్వొత్తులు.. చిన్న టాపాసులు, చిచ్చుబుడ్డులు కొనుక్కుంటే చాలని వేయి రూపాయలు పట్టుకిని మార్కెట్ కు వెళ్తే.. కనీసం నాలుగు బాక్సులు కూడా రావడం లేదని సామాన్య, మధ్యతరగతి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఏదో నాలుగు రకాల టపాసులు కాల్చి పండుగ చేసుకుందామని వచ్చే వారు.. వీటి ధరలు చూశాక కొనుగోలు చేయకుండానే ఇంటి దారి పడుతున్నారు.
గతేడాది కాకర పువ్వొత్తుల బాక్స్ సాదా రకం 45 ఉండేది. ఈ ఏడాది అది 100 రూపాయలకు చేరింది. ఇదే రకం పువ్వులయితే గతంలో 60 ఉంటే ఈసారి 150కి చేరింది. భూచక్రాలు గతేడాది బాక్స్ లపై ఎమ్మార్పీ అయితే 300ల కు తగ్గకుండా ఉన్నాయి. ఇక ఎక్కువమంది ఇష్పటడే చిచ్చుబడ్డీల బాక్సు ఏది చూసినా 400 రూపాయల ఎమ్మార్పీ ఉంటోంది. అయితే వాటిపై 10 శాతం, 20 శాతం డిస్కౌంట్ అంటూ.. వ్యాపారులు దోపీడీ చేస్తున్నారు.
ఈ సారి దీపావాళి బాంబుల ధరలు మండిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. గత రెండేళ్లు కరోనా కారణంగా విక్రయాలు లేక.. ఈ షాపుల వారు.. వీటిని తయారు చేసే వారు ఆదాయం కోల్పాయారు. ఈ నేపథ్యంలో ఆ నష్టం కవర్ చేసుకోవడానికి ఇదే సరైన సమయం అంటున్నారు. దీనికి తోడు.. అన్నీ రేట్లు పెరగడం కూడా దీపావళి బాంబుల రేట్లపై ప్రభావం చూపించింది అంటున్నారు,
దాదాపు అన్ని రకాల మందుగుండ సామాన్లపై 40 నుంచి 50 శాతం మేర రేట్లు పెరిగాయి. అయితే జీఎస్టీ, రావాణా కెమికల్స్ ధరలు పెరిగిన కారణంగా.. ఈసారి తమకు కూడా గిట్టుబాటు కావడం లేదు అంటున్నారు. కానీ మార్కెట్ కు వచ్చేవారంతా ఆ ధరలు చూసి కొనకుండానే వెనుతిరుగుతున్నారని.. వారు అడిగిన ధరకు అమ్మలేక.. విక్రయాలు సరిగ్గా జరగక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం అంటున్నారు వ్యాపారులు..