Vizag Beach: వైజాగ్ బీచ్ లో షాకింగ్ సీన్.., నల్లగా మారిన ఇసుక.. కారణం ఇదేనా..?
Vizag Beach: వైజాగ్ బీచ్ లో షాకింగ్ సీన్.., నల్లగా మారిన ఇసుక.. కారణం ఇదేనా..?
విశాఖపట్నం (Visakhapatnam) ఆర్కే బీచ్ (Vizag RK Beach) అంటే అందరికీ ఇష్టమే. బీచ్ చూసేందుకు స్థానికులే కాదు పర్యాటకులు కూడా క్యూ కడతారు. బీచ్ కు ఏ టైమ్ లో వెళ్లినా ఆహ్లాదాన్నిస్తుంది.
విశాఖపట్నం (Visakhapatnam) ఆర్కే బీచ్ (Vizag RK Beach) అంటే అందరికీ ఇష్టమే. బీచ్ చూసేందుకు స్థానికులే కాదు పర్యాటకులు కూడా క్యూ కడతారు. బీచ్ కు ఏ టైమ్ లో వెళ్లినా ఆహ్లాదాన్నిస్తుంది. ఇక విశాఖ వాసులైతే మార్నింగ్ వాకింగ్ నుంచి సాయంత్రం సరదాగా గడపే సమయం వరకు బీచ్ కే వెళ్తుంటారు. (File)
2/ 6
ఏపీలోని అన్ని బీచ్ ల కంటే వైజాగ్ ఆర్కే బీచ్ కే పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. సిటీలో ఉండటం అందునా అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండటంతో ఆర్కే బీచ్ కు ఫిదా అయిపోతుంటారు. (File) (Photo Credit: Facebook)
3/ 6
ఐతే అంత అందమైన బీచ్ ఇప్పుడు అందర్నీ భయపెడుతోంది. ఎప్పుడూ బంగారు వర్ణంలో మెరిసిపోయే విశాఖ బీచ్ ఇసుక.. శుక్రవారం ఉన్నట్లుండి నల్లగా మారిపోయింది. చాలా చోట్ల ఇసుకంతా నల్లకప్పు వేసినట్లు కనిపిస్తోంది. (File) (Photo Credit: Facebook)
4/ 6
దీంతో బీచ్ కు వెళ్లిన స్థానికులు, పర్యాటకులు ఏం జరిగిందోనని భయపడిపోతున్నారు. ఉన్నట్లుండి ఇసుక నల్లగా ఎందుకు మారింది.. ఏమైనా ప్రమాదం ముంచుకొస్తుందా అని అటు వైపు వెళ్లాలంటేనే భయపడిపోయే పరిస్థితి ఉంది. (File) (Photo Credit: Facebook)
5/ 6
ఐతే దీనిపై ఏయూ నిపుణులు స్పందించారు. బీచ్ లో ఇసుక నల్లబడటం వెనుక ఎలాంటి ప్రమాదం లేదని.. అయితే సముద్రంలోని మురికి ఒకేసారి బయటకు వచ్చినప్పుడు ఇలా ఇసుక నల్లగా కనిపించే అవకాశముందని చెబుతున్నారు. (File) (Photo Credit: Facebook)
6/ 6
అలాగే సముద్రంలోని ఇనుప రజను అలల తాకిడికి బయకు వచ్చినా ఇసుక నల్లబడుతుందని వివరిస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఘటనకు కారణం తెలియాలంటే ఇసుకన పరీక్షించాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. (File) (Photo Credit: Facebook)