Godavari Floods: గోదావరి (Godavari) మళ్లీ ఉగ్రరూపం దాలుస్తోంది. పరివాహక ప్రాంతంలో ఎగువ రాష్ట్రాలు మహారాష్ట్ర, చత్తిస్ ఘడ్, కర్ణాటక, తెలంగాణలతో పాటు.. మనరాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడుతుండడంతో.. వరద పొంగిపొర్లుతోంది.. దీంతో
జులై, ఆగస్టు నెలల్లో గోదావరికి వచ్చిన వరదలను మరవకముందే మరోసారి నదిలో ప్రవాహం పెరగడం ఆందోళన కలిగిస్తోంది.
ఎగువ నుంచి వస్తున్న వరదతో పాటు.. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో ఉప్పొంగి ప్రవహిస్తోంది. భద్రాచలం దగ్గర నీటిమట్టం అంతకంతకూ పెరుగుతుండటంతో మొదటి ప్రమాద హెచ్చరిక కంటిన్యూ అవుతోంది. దీంతో లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ దగ్గర కూడా వరద పోటెత్తుతోంది. ధవళేశ్వరం దగ్గర ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 9.36 లక్షల క్యూసెక్కులు పైగా నీటిని సముద్రంలోకి విడుదల చేశారు.
ఎగువ నుంచి వస్తున్న వరదతో పాటు.. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో ఉప్పొంగి ప్రవహిస్తోంది. భద్రాచలం దగ్గర నీటిమట్టం అంతకంతకూ పెరుగుతుండటంతో మొదటి ప్రమాద హెచ్చరిక కంటిన్యూ అవుతోంది. దీంతో లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ దగ్గర కూడా వరద పోటెత్తుతోంది. ధవళేశ్వరం దగ్గర ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 9.36 లక్షల క్యూసెక్కులు పైగా నీటిని సముద్రంలోకి విడుదల చేశారు.
గోదావరి ప్రధానపాయపై జైక్వాడ్ నుంచి బాబ్లీ వరకు అన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తేయడం, వాటికి మంజీర వరద తోడవుతుండటంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద ఉద్ధృతి పెరిగింది. వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు వదిలేస్తుండటం.. వాటికి కడెం వాగు, ఇతర వాగుల వరద తోడవుతుండటంతో ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వరద ప్రవాహం పెరుగుతోంది.
తుపాకులగూడెం, సీతమ్మసాగర్లలోకి వచ్చిన వరద వచ్చినట్టుగా దిగువకు వదిలేస్తుండటంతో భద్రాచలం వద్ద వరద ప్రవాహం గంటగంటకు పెరుగుతోంది. రాత్రి 7 గంటలకు 10.36 లక్షల క్యూసెక్కుల ప్రవాహం రావడంతో నీటిమట్టం 45.6 అడుగులకు చేరింది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరికను జారీచేశారు. భద్రాచలం నుంచి పోలవరం వద్దకు వచ్చిన వరదను వచ్చినట్టుగా 48 గేట్ల నుంచి దిగువకు వదిలేస్తున్న అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.
పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే దగ్గర నీటిమట్టం సోమవారం 32.1 మీటర్లకు చేరుకుంది. ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి 7,08,251 క్యూసెక్కులు చేరుతోంది. గోదావరి డెల్టాకు 2,600 క్యూసెక్కులను విడుదల చేస్తూ, 175 గేట్లను పూర్తిగా ఎత్తేసి 7,05,651 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. మంగళవారం ఉదయానికి ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి చేరే వరద 10.50 లక్షల క్యూసెక్కులకు చేరుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల గోదావరి బేసిన్లో మరో రెండు రోజులు వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ అంచనాల నేపథ్యంలో మరో మూడురోజులు గోదావరికి వరద ఉద్ధృతి కొనసాగనుంది. రోజురోజుకు నీటిమట్టం పెరుగుతుండటంతో పరివాహక ప్రాంత ప్రజలు భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉప నదులు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. శ్రీరామసాగర్‌కు ఎగువ నుంచి వరద రాక పెరుగుతుండటంతో వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువకు వదులుతున్నారు.
కాగా.. జులై, ఆగస్టు నెలల్లో గోదావరికి ప్రవాహం భారీగా వచ్చింది. వారం రోజులు ఏకధాటిగా కురిసిన వర్షాలతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ నుంచి దిగువకు వస్తున్న వరద నీటి మట్టం భద్రాచలం వద్ద తీవ్ర స్థాయికి చేరింది. ఒకానొక దశలో 67.9 అడుగులకు నీటిమట్టం నమోదైంది. దీంతో భద్రాచలం పట్టణంలోని పలు కాలనీలు ముంపునకు గురయ్యాయి. 1986 తర్వాత మొదటిసారిగా గోదావరి వంతెనపై రాకపోకలను రెండు రోజుల పాటు బంద్ చేశారు.
మరోవైపు కృష్ణా కూడా ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఆలమట్టి, నారాయణపూర్‌ల నుంచి వరద వేగంగా వస్తోంది. శ్రీశైలం ఆరు గేట్లు, నాగార్జునసాగర్ పది గేట్ల ద్వారా నీటిని దిగువకు వదులుతున్నారు. ఎగువన కురుస్తున్న వర్షాలతో నదిలో ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని, పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, అనవసరంగా ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నదుల లోకి దిగవద్దని సూచిస్తున్నారు.
గోదావరి నీటిమట్టం స్థానికులను భయాందోళనకు గురి చేస్తోంది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 43.9 అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. భద్రాచలం నుంచి 9 లక్షల 71 వేలకు పైగా క్యూసెక్కుల వరదను దిగువకు విడుదల చేస్తున్నారు. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరికి వరద ఉధృతి పెరిగింది.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో ఉపనదులు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. శ్రీరామసాగర్‌కు ఎగువ నుంచి వరద రాక పెరుగుతుండటంతో వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువకు వదులుతున్నారు. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడి ప్రస్తుతం దక్షిణ ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, విదర్భపై ఉన్న వాయుగుండం సోమవారం తీవ్ర అల్పపీడనంగా బలహీనపడింది.
మంగళవారం తీరం వెంబడి గంటకు 45–55.. గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. మత్స్యకారులు సముద్రంలో చేపలవేటకు వెళ్లవద్దని సూచించింది. మరోవైపు ఈనెల 18న ఉత్తర బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. గత 24 గంటల్లో రాష్ట్రంలో అక్కడక్కడ భారీవర్షాలు కురిశాయి.