అలాంటి వారికి లక్కీ ఛాన్స్ అనే చెప్పాలి ఆయిల్ ఫాం సాగు.. ఈ పంట కోసం ఒక్క సారి పెట్టుబడి పెడితే.. 30 ఏళ్లు వరసగా ఆదాయం పొందొచ్చు. అందుకే ఇప్పుడు అంతా ఆయిల్ పామ్ తోటల వైపు మళ్లుతున్నారు. విశాఖ, విజయనగరం జిల్లాల్లో నారాయణరాజుపేట, దాకమర్రి, సంగివలస, రావాడ, గెద్దపేట, కురపల్లి, రెడ్డిపల్లి, కుసులవాడ, మజ్జిపేట తదితర పంచాయితీల్లో ఈ సాగుపై ఫోకస్ చేస్తున్నారు.
ఆయా ప్రాంతాల్లో సుమారు 200 ఎకరాలకు పైగా ఆయిల్‌పామ్ సాగు చేస్తుండగా.. ప్రస్తుతం దిగుబడి ఇస్తున్నాయి. ఏడాదిలో 8 నెలల పాటు 15 రోజులకొకసారి ఎకరానికి 10–12 టన్నుల దిగుబడి వస్తుంది. ప్రస్తుతం టన్ను ఆయిల్‌పామ్ గెలల ధర 21 వేల రూపాయల వరకు కంపెనీల యజమానులు కొనుగోలు చేస్తున్నారు. నర్సీపట్నం దగ్గర బంగారుమెట్ట, విజయనగరం జిల్లా పార్వతీపురంలో కంపెనీలకు ఆయిల్‌పామ్ గెలలను తరలిస్తున్నారు.
గోదావరి జిల్లాల్లో అయితే చిన్న కమతాలు కలిగిన రైతులు కూడా ఆయిల్‌పామ్‌కే మొగ్గు చూపుతారు. గత ప్రభుత్వాల హయాంలో 60 రూపాయలు ఉండే ఆయిల్‌పామ్ మొక్కను రాయితీ పోను మూడు ఎకరాల్లోపు రైతులకు 5 రూపాయలకు.. మూడు నుంచి ఐదు ఎకరాల్లోపు రైతులకు 10 రూపాయలకు, ఐదు ఎకరాల కంటే ఎక్కువ భూమి కలిగిన రైతులకు 30 రూపాయల వంతున ప్రభుత్వం సరఫరా చేసేది.
ఆయిల్‌పామ్ సాగు చేసే రైతులకు మొక్కలు ఉచితంగా లభిస్తుండగా ఎకరాకు గాను పెట్టుబడి నిమిత్తం సుమారు 30 వేల రూపాయల నుంచి 40 వేల వరకు ఖర్చు అవుతుంది అంటున్నారు. అయితే మొక్కకు డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిలో రోజుకు 250 లీటర్ల నీరు, మూడు నెలలకు ఒకసారి మొక్కకు 3–4 కిలోల ఎరువులు, అవసరమైన చోట మట్టలు నరకడం చేస్తే సరిపోతుంది.
మరికొందరు సోలార్ ద్వారా బిందుసేద్యం మొదలుపెట్టారు. మరికొందరు ఆయిల్ ఫాం మధ్యలో అరటి.. బొప్పాయి లాంటి పంటలు వేస్తున్నారు. ఆయిల్‌పామ్ నాలుగేళ్లు తర్వాత దిగుబడి ప్రారంభయి జీవితకాలం 30 ఏళ్ల వరకు ఆదాయం ఇస్తుంది అని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. అరటి, బొప్పాయి వలన ఏడాదికి లక్ష అదనపు ఆదాయం లభిస్తుంది.