Mrs India: అందమైన భామలు మెరుపు తీగల్లా మెరుపులు మెరిపించారు. పెళ్లైన తరువాత కూడా తమ అందం ఏ మాత్రం చెక్కు చెదరలేదని నిరూపిస్తూ.. ర్యాంప్ పై హొయలు ఒలికించారు..
P Anand Mohan, Visakhapatnam, News18 Mrs India: వయ్యారి భామా నీ హంస నడక అంటూ.. భామలు మెరుపు తీగల్లా మెరిశారు. ర్యాంప్ పై వయ్యారాలు ఒలకబోసారు. సుందర విశాఖ నగరానికి పోటీ ఇచ్చేలా అందాలతో ఆహుతలను ఆకట్టుకున్నారు.
2/ 9
విశాఖపట్నంలో జరిగిన మిసెస్ ఇండియా ఆంధ్రప్రదేశ్ ఆడిషన్స్ లో భాగంగా అందమైన భామలు తమ టాలెంట్ చూపించారు. ర్యాంప్ వాక్ తో అదరగొట్టారు. వివాహమైనా.. ఇప్పటికే తమ అందం చెక్కు చెదరలేదంటూ మెరుపులు మెరిపించారు.
3/ 9
మహిళలు మహరాణులు అనేది మరోసారి ప్రూవ్ చేసేలా ఈ పోటీలు సాగాయి. మిసెస్ ఇండియా ఆంధ్రప్రదేశ్ ఆడిషన్స్ లో భాగంగా మహిళలు తమ అందాలతో ప్రదర్శన చేశారు. విశాఖ లో నిర్వహించిన ఈ ఈవెంట్జ విజయవంతంగా ముగిసింది.
4/ 9
మోడలింగ్ లో ఇంట్రెస్ట్ ఉండి.. ఇతర కారణాల కారణంగా మిస్ అయ్యి.. వివాహం అయిన మహిళలకు ఇది అద్భుత అవకాశం. అందుకే ఇలా పెళ్లి అయిన తరువాత వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు మహిళలు..
5/ 9
వివాహిత మహిళలకు అతి పెద్ద వేదిక మిసెస్ ఇండియా. ఆంధ్రప్రదేశ్ 2022-23 ఎడిషన్ కోసం విశాఖపట్నం విజయవంతంగా ఆడిషన్లను నిర్వహించింది. ఇందులో 20 నుంచి 60 సంవత్సరాల వయస్సు గల అనేక మంది వివాహిత మహిళలు.. వారి కుటుంబ సభ్యులతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
6/ 9
ఈ పోటీలు కేవలం అందాలను వెలుగులోకి తేవడానికి మాత్రమే కాదన్నారు నిర్వాహకులు..మహిళల్లో ఉండే ఆత్మవిశ్వాసం.. ప్రతిభ.. వివాహితగా సమాజానికి సహాయం చేయడానికి రోల్ మోడల్స్ గా ఉండే వారిని ప్రపంచానికి పరిచయం చేయడమే ఈ పోటీల ఉద్దేశం అన్నారు.
7/ 9
కుటుంబ సభ్యులందరికీ అండగా నిలిచినట్లే, తన ప్రయాణంలో ఇంటి మహిళకు మద్దతు ఇవ్వాలని ఆమె కుటుంబ సభ్యులను అభ్యర్థించారు. అందుకే ఈ పోటీలకు తక్కువ సమయంలోనే అనూహ్య స్పందన వచ్చిందని నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేశారు.
8/ 9
మిసెస్ ఇండియా ఆంధ్ర ప్రదేశ్, మిసెస్ ఇండియా తెలంగాణరీజినల్ డైరెక్టర్. మిసెస్ ఇండియా 2017 విజేతగా, మిసెస్ ఏషియాఇంటర్నేషనల్ వరల్డ్ 2017 విజేతగా, “ పైడ్ ఆఫ్ తెలంగాణ" అనే బిరుదులను అందుకున్నారు.
9/ 9
2018 నుండి పోటీలను నిర్వహిస్తున్నారు. 2019లోబెస్ట్ బ్యూటీ పేజెంట్ ఆర్గనైజర్ అవార్డులను మహిళలు గెలుచుకున్నారు. అయితే Covid దృష్ట్యా 2020, 2021 ఆడిషన్లను పూర్తిగా ఆన్ లైన్ మోడ్ లో నిర్వహించారు.