Bamboo: సాధారణంగా వాస్తు దోషాలు ఉంటే ఏ పని సక్రమంగా జరగదు. అంతేకాకుండా మన కెరీర్ లో పురోగతి ఉండదు. వాస్తు శాస్త్రంలో (Vastu Shastra) ఇంటి దోషాలు లేదా ప్రతికూలతను తొలగించడానికి అనేక చిట్కాలు చెప్పబడ్డాయి. అందులో ఒకటి వెదురు మెుక్కలను నాటడం. అయితే ఇది ఇంటి ఆవరణలో సరైన దిశలో నాటితే ఆ ఇంట్లో డబ్బే డబ్బు.. ఇక మీకో ఖాళీ స్థలం ఉంటే అందులో వెదురు సాగు చేస్తే.. వేలలో పెట్టుబడి పెట్టి.. లక్షల్లో సంపాదించవచ్చు..
వెదురు మొక్కలు నాటడం వల్ల ఆ ఇంటి యమజానికి ఐశ్వర్యం పెరుగుతుంది. సాధారణంగా వెదురు మెుక్కను (Bamboo Plant) అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు. దీన్ని సరైన దిశలో నాటడం ద్వారా మాత్రమే మేలు జరుగుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో వెదురు మొక్కను నాటడం వల్ల ప్రతికూల శక్తి నశిస్తుంది మరియు సానుకూల శక్తిని ప్రసారం చేస్తుంది. సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవి వెదురులో కొలువు ఉంటుంది.
వెదురు మొక్కలు నాటడం వల్ల అపారమైన డబ్బు వస్తుంది. పిల్లల మనస్సు చదువుపై లగ్నమవుతుంది. జీవితంలో సంతోషం, శాంతి, శ్రేయస్సు పెరుగుతాయి. అయితే వెదురు మొక్కను నాటేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. వెదురు మొక్కను కొనుగోలు చేసేటప్పుడు, దాని ఆకులు పసుపు రంగులో ఉన్నాయో లేదో చూసుకోండి. పసుపు ఆకులు ఉన్న మొక్కలు మాత్రమే వాస్తు శాస్త్రం ప్రకారం మంచివి అని చెబుతారు.
ఇంటి తూర్పు దిశలో వెదురు మొక్కను నాటడం వల్ల ధనంతోపాటు శుభం చేకూరుతుంది. అదేవిధంగా, దీనిని ఆగ్నేయ దిశలో నాటడం వల్ల సంపద వస్తుంది. చదువులో, ఉద్యోగంలో విజయం సాధించాలంటే... వెదురు మొక్కను ఉత్తర దిశలో ఉంచాలి. ఇంటి దగ్గర ఒక మొక్కను పెంచడమే కాదు.. దీన్ని మీకు ఉన్న ఖాళీ స్థలంలో సాగు చేసుకుంటే.. లాభాలే లాభలే అంటున్నారు.
సాధరణంగా గిరిజన ప్రాంతాల్లోనే కనిపించే ఈ వెదురు చెట్ల పెంపకాన్ని ఇప్పుడు అన్ని ప్రాంతాల్లో చేపట్టొచ్చని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ ప్రకటించింది. దీనిలో భాగంగా బేంబూ (వెదురు) మిషన్ ప్రాజెక్టు ను అమలు చేయాలని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు కింద అటవీ ప్రాంతాలకు వెలుపల బంజరు భూములు, పంట పొలాలు, గ్రామాల్లో ప్రభుత్వ ఖాళీ స్థలాలు, కాలువలు, చెరువు గట్ల వెంబడి వెదురు మొక్కలను పెంచుతారు.
వెదురు వనాల పెంపకం, ఉత్పత్తుల అమ్మకాలు ఇటీవల వరకు అటవీ శాఖ పరిధిలో వుండేవి. దీంతో అటవీయేతర ప్రాంతాల్లో ఎవరైనా వెదురు సాగు చేపట్టి, ఉత్పత్తులను అమ్ముకోవాలంటే అటవీ శాఖ అనుమతులు తప్పని సరి అయ్యేవి.. అయితే ఇప్పుడు రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వెదురు ఉత్పత్తులకు మార్కెట్లో నానాటికీ ఆదరణ పెరుగుతోంది. అడవులకు వెలుపల వున్న ప్రాంతాల్లో వెదురు పెంపకం చేపట్టాలన్న ఆసక్తి వున్న రైతులకు అటవీ శాఖ నిబంధనలు అడ్డంకిగా మారాయి.
అందుకే ఈ సమస్య ప్రభుత్వం దృష్టికి రావడంతో అటవీ, పర్యావరణ శాఖ పరిధిలో ఉన్న రాష్ట్ర వెదురు మిషన్ను వ్యవసాయ, సహకార శాఖ (ఉద్యానశాఖ) లోకి మారుస్తూ ఈ ఏడాది ఫిబ్రవరి 16వ తేదీన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. రికార్డు చేయబడిన అటవీ ప్రాంతాల వెలుపల వ్యవసాయ భూముల్లో వెదురు సాగును ప్రోత్సహించడంతోపాటు వెదురుకు అదనపు విలువ జోడించేందుకు ఈ మార్పు చేసినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో వెదురు ప్రాజెక్టు అమలుకు సంబంధించి ఉద్యాన శాఖ అధికారులు సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందజేశారు. దీనిని పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం, ప్రాజెక్టు అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ నుంచి అనకాపల్లి జిల్లా అధికార యంత్రాంగానికి ఉత్తర్వులు అందాయి.
ఇక జిరాయితీ భూముల్లో సంబంధిత రైతులు వెదురు సాగు చేసుకుంటారు. వీరికి 50 శాతం రాయితీపై ఉద్యాన శాఖ నర్సరీల నుంచి మొక్కలను అందజేస్తారు. గ్రామాల్లో ఖాళీగా వున్న ప్రభుత్వ, పంచాయతీ స్థలాలు, కాలువలు, చెరువు గంట్ల వెంబడి వెదురు మొక్కలను నాటి పెంచుతారు. ఈ బాధ్యతను స్థానిక డ్వాక్రా సంఘాలకు లేదా ఉపాధి కూలీలకు అప్పగిస్తారని అధికారవర్గాల ద్వారా తెలుస్తోంది.
మొక్కలు నాటిన ఐదు సంవత్సరాల తరువాత వెదురును నరుకుతారు. ‘బేంబూ మిషన్ ప్రాజెక్టు’లో భాగంగా గ్రామీణ యువతతో వెదురు ఆధారిత ఉత్పత్తుల తయారీకి కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేయిస్తామని, ఈ ఉత్పత్తుల అమ్మకం ద్వారా స్వయం ఉపాధి లభిస్తుందని జిల్లా ఉద్యాన శాఖ చెబతోంది. కేవలం వేలల్లో పెట్టుబడి పెడితే.. లక్షల్లో ఆదాయం వస్తుందనే భరోసా కల్పిస్తోంది.