సఖినేటిపల్లి మండలం అంతర్వేది గ్రామానికి చెందిన మత్స్యకారుల వలకు ఓ పెద్ద చేప చిక్కింది. అది కచిడి మగ చేప అని మత్స్యకారులు గుర్తించారు. ఈ కచిడి మగ చేప లక్షల ఖరీదు చేస్తుంది. ఆ పెద్ద చేపను అంతర్వేది మినీ హార్బర్లో.. వేలం పాట పెట్టారు. అదే గ్రామానికి చెందిన వ్యాపారి వెంకటేశ్వరరావు… భారీ ధరకు వేలం పాట పాడి ఈ కచిడి మగచేపను దక్కించుకున్నారు.