కార్తీకమాసం మార్గశిర మాసంలో ఎక్కువగా పెళ్లిళ్లు జరుగుతాయి. కాని మూఢాల కారణంగా మాఘమాసంలో పెళ్లిళ్లు జరుపుతున్నారు. ఈనెలలో ముహుర్తాలు అతి తక్కువగా ఉన్నాయి. మళ్లీ ఏప్రిల్ నెలలో మూఢం ఉండటంతో ఈ కొద్ది రోజుల్లో ఉన్న ముహుర్తాల్లోనే శుభకార్యాలు, వివాహాది వేడుకలను నిర్వహించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. (ప్రతీకాత్మకచిత్రం)
వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో కూడా అతి తక్కువ ముహుర్తాలు ఉన్నాయి. ఏప్రిల్లో ఉగాది తర్వాత చైత్రమాసంలో మళ్లీ మౌఢ్యం వస్తోంది. శుభ ముహూర్తాలు మేలో కానీ ఉండవు. దీంతో డిసెంబరులో అందుబాటులో ఉన్న కొన్ని ముహూర్తాల్లోనే ఎక్కువ మంది పెళ్లి ఏర్పాట్లు చేసుకుంటున్నారని పండితులు చెబుతున్నారు.(ప్రతీకాత్మకచిత్రం)