Visakhapatnam: సాగర గర్భంలో వింతల్ని చూస్తారా..? విశాఖలో రెడీ కానున్న ఓషినేరియం

అందాల నగరం విశాఖలో మరో అద్భుతం చోటు చేసుకోబోతోంది. ఓ వైపు బీచు అందాలు చూపు తిప్పుకోనీయకుండా చేస్తాయి.. అయితే ఇకపై ఒడ్డున నిల్చొని అందాలు చూడడం మాత్రేమే కాదు.. సముద్రగర్భంలోకి వెళ్లి.. వింత వింత జంతువులను టచ్ చేసే అవకాశం కూడా దక్కబోతోంది.