Araku Coffee: ప్రపంచ వ్యాప్తంగా కాఫీకి ఓ ప్రత్యేక క్రేజ్ ఉంటుంది. కాఫీ రుచి తగలనిదే కొందరికి రోజు మొదలవ్వదు. ఇక భారత దేశంలో కాఫీకి ప్రత్యేక డిమాండ్ ఉంటుంది. రోజుకు కప్పుల కప్పుల కాఫీలు తాగేస్తారు చాలామంది. అసలు కాఫీ తాగకపోత ఏదో మిస్ అయ్యాం అనే ఫీలింగ్ ఉంటుంది చాలామంది.. అందుకు ఎక్కడైనా కాఫీకి ప్రత్యేక డిమాండ్ ఉంటుంది.
ఓ మంచి కాఫీ తియ్యటి అనుభూతిని అందిస్తుంది. మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. కమ్మగా ఉండే కాఫీ పంట ఎక్కడో కాదు మన ఆంధ్రప్రదేశ్‌లోనే పండుతోంది. విశాఖ జిల్లాలోని అరకులో పండే కాఫీ ఆకులకు దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగానూ మంచి డిమాండ్ ఉంటోంది. మన కాఫీ బ్రాండ్‌ను అరకు కాఫీ విదేశీ మార్కెట్లో మరింత సుస్థిరం చేస్తోంది.
ఆదివారం జపాన్ పౌండ్ విలువ 91.0267 రూపాయలు ఉంది. అంటే కప్పు కాఫీ ధర 637 రూపాయలు పడుతోంది.. ఏడు పౌండ్ల ధర అంటే జపాన్ వారికి పెద్ద లక్క కాకపోవచ్చు.. కానీ మన రూపాయల లెక్కలో చూస్తే.. 637 రూపాయాల ధర అంటే షాకే అనిపిస్తుంది. కేవలం జపాన్ లోనే కాదు.. చాలా ప్రంతాల్లో మన అరకు కాఫీకి భారీ డిమాండ్ ఉంటోంది.
మొదటి నుంచి అంతర్జాతీయంగా అరకు కాఫీకి మంచి డిమాండ్ ఉంది. అంతేకాదు అత్యధికంగా కాఫీ తోటలను సాగు చేసే బ్రెజిల్, మన దేశంలోని కర్ణాటక రాష్ట్రంలో ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయింది. దీంతో అరకు కాఫీకి మరింత డిమాండ్ పెరిగింది. ఆంధ్రప్రదేశ్‌లోని పాడేరు కాఫీ ప్రాజెక్ట్ పరిధిలో ఏజెన్సీ ప్రాంతంలో అరబికా, రోబస్టా చెర్రీ కాఫీ రకాలను సాగు చేస్తున్నారు.
బెంగళూరులోని అనేక ప్రైవేటు సంస్థలు అరకు కాఫీ గింజలను సేకరిస్తాయి. ఆ గింజలను శుద్ధి చేసి ఇన్స్టెంట్ కాఫీ పొడిగా, వివిధ రకాల కాఫీ పొడులుగా మార్చి ఆకర్షణీయంగా ప్యాకింగ్ చేసి జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయిస్తాయి. అయితే, వ్యాపారులు అరకు కాఫీ పొడి పేరుతోనే బెంగళూరును కేంద్రంగా చేసుకుని బ్రెజిల్, జపాన్ తదితర దేశాలకు పెద్ద ఎత్తున ఎగుమతి చేస్తున్నారు.