అల్పపీడనం ప్రభావంతో మంగళవారం కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశముంది. అలాగే ఈనెల 17 ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురుస్తాయి. అటు విశాఖపట్నం, ఉభయగోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. (ప్రతీకాత్మకచిత్రం)
వాయుగుడం తీరాన్ని సమీపించే అవకాశమున్న ఈనెల 18వ తేదీన నెల్లూరు, ప్రకాశం, కడప జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయి, విశాఖపట్నం, విజయనగరం, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ఈనెల 19నవిజయనగరం,విశాఖపట్నం,ఉభయ గోదా వరి, కృష్ణా జిల్లాలో భారీ వర్షాలకు అవకాశముంది. (ప్రతీకాత్మకచిత్రం)