P Anand Mohan, Visakhapatnam, News18. Jack Fruit: రుచి గల పనసపండు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇందులోని ఎన్నో పోషక విలువలు మనకి అందాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తాయి. అంతేకాదు వీర్య వృద్ధికి.. సంతాన భాగ్యం కలిగించేలా చేస్తాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఏజెన్సీలో దొరికే పనస పండుతో ఈ లాభాలన్నీ ఉంటాయని నమ్ముతారు.. ఎలాంటి కెమికల్ లేకుండా సహజసిద్ధంగా పండుతాకి కాబట్టే వీటికి డిమాండ్ కానీ.. ఇప్పుడు ఆ పనస పండు కొనాలి అంటేనే భయపడుతున్నారు..
ఇప్పుడు జేబులు కూడా ఖాళీ చేయిస్తోంది. పది రూపాయలకు తొనలే అమ్మడం లేదు మార్కెట్లో. అంతే కాదు.. పెద్ద సైజు కాయ రేటు అమాంతం పెరిగిపోయింది. అయిదువందలు ఇస్తే కానీ.. ఓ మోస్తరు సైజు పనస కాయ ఇంటికి తీసుకెళ్లలేం అంటున్నారు వినియోగదారులు. అలాగే అక్కడ కోయించడానికి.. తొనలు వలిపించడానికి కూడా మరికొంత ఇవ్వాల్సిందే.
పండ్లల్లో అతి పెద్దది పనసపండు. ఒక్కో పండు 5 నుంచి 50 కేజీల వరకు బరువు తూగుతుంది. దాదాపు 3 నుంచీ 4 అడుగుల వరకు పొడవు పెరుగుతుంది. పనసలో ఏకంగా 300 రకాలు జాతులు ఉన్నాయట. ఉత్పత్తి అయ్యే పళ్లలో చాలా ఏళ్ల క్రితం వరకు 80 శాతం వృథా అయ్యేవి. కానీ.. ఈ మధ్య కాలంలో వీటి విలువ జనాలకు బాగా అర్ధం అయ్యింది. పనసతో 200 రకాల వంటకాలు చేయొచ్చు మరి. పనసపొట్టు కూర, పసన దోసెలు వంటి సంప్రదాయ వంటకాలు తయారు చేసి లాగించేయొచ్చు.