ఈ నేపథ్యంలో ఒమిక్రాన్ కేసు నమోదైనట్లు వస్తున్న వార్తలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ఏపీలో అసలు ఒమిక్రాన్ కేసు నమోదు కాలేదని స్పష్టం చేసింది. సదరు వ్యక్తికి కరోనా పాజిటివ్ మాత్రమే వచ్చిందని.. ఒమిక్రాన్ కు చెందిన టెస్ట్ రిపోర్ట్ ఇంకా రాలేదని.. కావున ఒమిక్రాన్ సోకినట్లు వస్తున్న వార్తలను నమ్మొదన్న ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు శ్రీకాకుళం జిల్లా వైద్యాధికారి బి.జగన్నాథరావు ప్రకటన విడుదల చేశారు.
ఒమిక్రాన్ సోకినట్లు ప్రచారంలో ఉన్న వ్యక్తి నవంబర్ 20వ తేదీన బ్రెజిల్ నుంచి బయలుదేరే సమయంలో కరోనా టెస్ట్ చేయించుకోగా నెగెటివ్ వచ్చిందని.. అలాగే 22వ తేదీన ముంబై చేరుకోగానే టెస్ట్ చేయించుకోగా అక్కడ కూడా నెగెటివ్ వచ్చినట్లు శ్రీకాకుళం డీఎంహెచ్ఓ లిపారు. ఆయన ఈనెల 23వ తేదీన శ్రీకాకుళం జిల్లాలోని ఉమిలాడ చేరుకున్నట్లు వెల్లడించారు. (ప్రతీకాత్మకచిత్రం)
రాష్ట్ర ప్రభుత్వం పంపిన వివరాల మేరకు ఈనెల 5వ తేదిన కరోనా టెస్టులు నిర్వహించగా పొజిటివ్ గా తేలినట్లు అధికారులు వివరించారు. వెంటనే సదరు వ్యక్తి సీరం శాంపిల్స్ ను టెస్టులకు పంపామని.. ఇంకా టెస్ట్ రిజల్ట్స్ రాలేదని.. అప్పటివరకు ఇది సాధారణ కరోనా మాత్రమేనని స్పష్టం చేశారు. టెస్ట్ రిపోర్ట్స్ వచ్చేవరకు ఒమిక్రాన్ అంటూ వస్తున్న వందతులను నమ్మొద్దని తెలిపారు. (ప్రతీకాత్మకచిత్రం)
ఇదిలా ఆంధ్రప్రదేశ్ లో మంగళవారం కొత్తగా 184 కరోనా పాజిటివ్ కేసలు నమోదుకాగా.. ఇద్దరు మృతి చెందారు. అంతర్జాతీయ ప్రయాణికులపై దృష్టిపెట్టిన ఏపీ ప్రభుత్వం.. వారి చిరునామాల ఆధారంగా ఎప్పటికప్పుడు టెస్టులు నిర్వహిస్తూ.. పాజిటి వచ్చిన వారిని శాంపిల్స్ ను ల్యాబ్ కు పంపుతోంది. ప్రస్తుతానికి ఒమిక్రాన్ కు సంబంధించి ఎలాంటి కేసులు నమోదు కాకపోవడంతో జనం ఊపిరి పీల్చుకుంటున్నారు. (ప్రతీకాత్మకచిత్రం)