వినాయక చవితి అంటే అందరికీ గుర్తు వచ్చేది చంద్రుడి కథే.. మరి చవితి పర్వదినం పురస్కరించుకుని సాక్షాత్తు ఆ చంద్రుడే ప్రతిష్టించిన గణపయ్య గురించి మీకు తెలుసా..? సాక్ష్యాత్తు చంద్రుడే వచ్చి బెల్లం వినాయకుడిని ప్రతిష్టించినట్టు పురాణాలు, పూర్వికుల మాట. అయితే బెల్లం వినాయకుడి (Jaggery Ganapathi)గా పూజలందుకుంటున్న ఈ గణపయ్య విశాఖపట్నంలో కొలువుదీరాడు.
ఈ విగ్రహం అన్ని రూపాలకన్నా భిన్నంగా ఉంటుంది. స్వామివారి తొండం ఇక్కడ కుడివైపు తిరిగి ఉంటుంది. ఈ బెల్లం వినాయక స్వామిని దర్శించుకుంటే కోరిన కోర్కెలు తీరి.. ఆనందాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. అందుకే ఈ బెల్లం గణపతిని ఆనంద గణపతి అని కూడా పిలుస్తారు. పలువురు ప్రముఖులు కూడా సక్సెస్ కోసం ఈ వినాయకుడ్ని దర్శించుకుంటూ ఉంటారు.
అలా కలత చెందిన చంద్రుడు.. ఎంతో భక్తితో శివుడి గురించి ఘోర తపస్సు చేస్తే శివుడు ప్రత్యక్షమయ్యాడని.. అప్పుడు చంద్రుడు శివుడిని అయ్యా..నీ దేవాలయం సముద్రంలో కలిసిపోయింది..కాబట్టి నువ్వు ఇక్కడ వెలిసి భక్తులతో పూజలందుకోవాలని కోరాడని.. దానికి శివుడు వినాయకుడు దేవాలయం వద్ద స్వయంభూవుగా వెలిశాడని చెపుతారు.