విశాఖ ఆర్ కె బీచ్ లో జి 20 సదస్సు సన్నాహక మారథాన్ ప్రారంభించారు మంత్రులు. RK బీచ్ నుండి 3కె , 5కె మరియు 10కె మారథాన్ పరుగులను రాష్ట్ర మంత్రులు గుడివాడ అమర్నాథ్, ఆదిమూలపు సురేష్ లతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం విహాంగ్ ఎడ్వెంచర్స్ వారు ఏర్పాటు చేసిన పార మోటార్ ఎయిర్ సఫారీ ప్రారంభించారు.
విశాఖ నగరంలో జి-20 సదస్సులు నిర్వహించడం ద్వారా విశాఖ జిల్లా కు ప్రపంచ స్థాయి గుర్తింపు ఏర్పడుతుందని వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ మరియు జిల్లా ఇన్చార్జి మంత్రి విడదల రజని అన్నారు.
2/ 8
ఆదివారం ఉదయం RK బీచ్ నుండి 3కె , 5కె మరియు 10కె మారథాన్ పరుగులను రాష్ట్ర మంత్రులు గుడివాడ అమర్నాథ్, లతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం విహాంగ్ ఎడ్వెంచర్స్ వారు ఏర్పాటు చేసిన పార మోటార్ ఎయిర్ సఫారీ ప్రారంభించారు.
3/ 8
ఈ సందర్భంగా మంత్రి విడదల రజని మాట్లాడుతూ, ఈ నెల తేదీ 28 మరియు 29 లలో విశాఖ వేదికగా జరగబోవు జి-20 సదస్సులు నిర్వహణలో భాగంగా ప్రజల్లో అవగాహన పెంపొందించుకునే కార్యక్రమాల సందర్భంగా 3కె , 5కె మరియు 10కె మారథాన్ పరుగులను ఈరోజు నిర్వహించు కోవడం జరిగిందన్నారు.
4/ 8
ఈ మారధాన్ లో ప్రజలు ముఖ్యం గా యువత పెద్ద ఎత్తున పాల్గొని మద్దతు తెలపడం శుభపరిణామన్నారు. జి-20 సదస్సులో పాల్గొనేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ నెల 28వ తేదీ వస్తారని అన్నారు.
5/ 8
సుమారు 200 మంది ప్రతినిధులు జి-20 సదస్సులో పాల్గొనేందుకు వస్తున్నారని తెలిపారు. వాతావరణంలో గాలి అనుకూలంగా లేనందున విహాంగ్ ఎడ్వెంచర్స్ వారు ఏర్పాటు చేసిన పార మోటార్ ఎయిర్ సఫారీ ఎగరలేదని తెలిపారు.
6/ 8
ఈ కార్యక్రమంలో నగర మేయర్ హరి వెంకట కుమారి, జిల్లా కలెక్టర్ డా ఏ మల్లిఖార్జున, మున్సిపల్ కమిషనర్ పి. రాజాబాబు, పోలీస్ కమిషనర్ సి హెచ్ శ్రీకాంత్ , అధికారులు, ప్రజలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
7/ 8
మరోవైపు జీ20 సదస్సుకు వివిధ దేశాలకు చెందిన 200 మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. దీంతో వారి కి కావలసిన రవాణా, వసతి, భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. సదస్సు నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా విదేశీ ప్రతినిధులు పర్యటించే ప్రాంతాలలో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసినట్లు తెలిపారు.
8/ 8
ఈ సదస్సు కోసం 46 కిలోమీటర్ల బిటి రోడ్డు పనులు, 24 కిలోమీటర్ల పెయింటింగ్ పనులు, పది కిలోమీటర్ల ఫుట్ పాత్ నిర్మాణం శాశ్వత ప్రాతిపదికన పూర్తి చేసినట్లు తెలిపారు. విశాఖ నగరం దేశంలోనే సుందర నగరంగా నిలవనుంది.