Andhra Apple: యాపిల్ అంటే ఒకప్పుడు కశ్మీర్ యాపిల్ అని మాత్రమే అనే వారు.. సినిమాల్లో హీరో యిన్లను హీరోలు వర్ణించడానికి.. ప్రేమికులు తన ప్రియురాలిని ప్రసన్నం చేసుకునేందుకు కశ్మీర్ యాపిల్ లా ఉన్నావంటూ పొగడ్తలు కురిపిస్తూ ఉంటారు. అంతలా ఫేమస్ అయ్యింది కశ్మీర్ యాపిల్.. ఇప్పుడు మన ఆంధ్రా కశ్మీర్ లోనూ యాపిల్స్ వేరే లెవల్ అన్నట్టు ఉంటున్నాయి.
పర్యాటక ప్రాంతమైన అరుకు, లంబసింగి ప్రాంతాల్లో ఇప్పుడు యాపిల్ తోటలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. యాపిల్ సాగులో ఒక్కో మొక్కకు 20 నుంచి 30 యాపిల్స్ విరగ గాసిన దృశ్యాలు ప్రకృతి ప్రియులను కనువిందు చేస్తూ చేస్తున్నాయి. కెంపయిన రంగుతో, ఇంపయిన సైజుతో, ఊరించే రుచులతో ఆకర్షిస్తోన్న ఈ యాపిల్స్ లంబసింగికి కొత్త అందాలను దిద్దుతున్నాయి.
తాజాగా మాడెం గ్రామంలో ఓ రైతు పంట పొలంలో ఆపిల్ కాయలు విరగ్గాశాయి. ఒక్కో చెట్టుకు సుమారు 20 నుంచి 30 కాయలు వచ్చాయి. కాయల పరిమాణం కూడా బాగుంది. సాధారణంగా ఆపిల్ దిగుబడి పెరగాలంటే సకాలంలో ప్రూనింగ్తో పాటు ఇతర యాజమాన్య పద్ధతులు పాటించాలి. సాంకేతిక సహకారం లేక మాడెం రైతులు ఎటువంటి యాజమాన్య పద్ధతులు పాటించడం లేదు. అయినా ఆపిల్ మొక్కలు బాగానే కాపుకొస్తున్నాయి.
ప్రభుత్వం సాంకేతిక సహకారం అందించాలని రైతులు కోరుతున్నారు.