ఫిష్ అక్వేరియం ఒక జత చేపలను ఉంచడం వల్ల జీవితంలో పురగతి, అభివృద్ధి జరిగే అవకాశాలున్నాయని ఫెంగ్ షుయ్ టిప్స్‌లో పేర్కొన్నారు. వీటిని ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తి దూరమవుతుందంటున్నారు. అయితే కొందరికి అక్వేరియం ఇంట్లో పెట్టుకోవడం ఇష్టం ఉండదు.. అలాంటి వారు.. ఇత్తడి లేదా వెండి చేపల విగ్రహాలను కూడా పెట్టుకోవచ్చని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.