దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంతో పాటు తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలై తీవ్రప్రభావం చూపుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ఐదు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని.. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. తీరం వెంబడి బలమైన గాలులు వీచే అవకాశముండటంతో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించింది. (ప్రతీకాత్మకచిత్రం)
అలాగే తుఫాన్ సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు ముగ్గురు ప్రత్యేక అధికారులను నియమించారు. విశాఖజిల్లాకు శ్యామలరావు, విజయనగరం జిల్లాకు కాంతిలాల్ దండే, శ్రీకాకుళం జిల్లాకు హెచ్.అరుణ్ కుమార్ ను నియించారు. సంబంధిత అధికారులు వెంటనే ఆయా జిల్లాలకు వెళ్లి బాధ్యతలు స్వీకరించాలని సీఎం ఆదేశించారు. (File Photo)